Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండల వ్యాప్తంగా శనివారం సర్పంచ్ల ప్రమాణస్వీకారోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రాజకీయాలకతీతంగా సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఆయా గ్రామాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రజాప్రతినిధులకు తెలిపారు. ప్రత్యేకంగా తెల్దారుపల్లి, మద్దులపల్లి సర్పంచ్ల ప్రమాణస్వీకారం యువత ఆధ్వర్యంలో కోలాహలంగా నిర్వహించారు. ఏకగ్రీవ ఆనవాయితీని కొనసాగిస్తూ తెల్దారుపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన సిద్దినేని కోటయ్యను పలువురు ప్రముఖులు అభినందించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామమైన మద్దులపల్లిలో ఎర్ర జెండా ఎగురవేసిన కర్లపూడి సుభద్రను మండల ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. తల్లంపాడులో 12వార్డులకు గానూ ఆరు వార్డులు గెలిచిన సీపీఐ(ఎం) వార్డు మెంబర్ల ప్రమాణస్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ అశోకచక్రవర్తి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓఆర్డీ ప్రభాకర్‌రావు, మండల వ్యవసాయాధికారి నాగేశ్వ రరావు, సీపీఐ(ఎం) నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, రెంటాల ఆనంద్, పల్లె శ్రీనివాసరావు, యామిని ఉపేందర్, గింజుపల్లి మల్లయ్య, వట్టికోట నరేష్, నువ్వుల నాగేశ్వరరావు, టీ.నాగేశ్వరరావు, తమ్మినేని కోటేశ్వరరావు, జాలారు సంగయ్య, తమ్మినేని కమలమ్మ, యల్లంపల్లి నాగయ్య, కృష్ణయ్య, నర్సింహారావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, పెంట్యాల నాగేశ్వరరావు, సుధాకర్ పాల్గొన్నారు.
కల్లూరు : మండలంలోని 31 గ్రామపంచాయతీల్లో శనివారం కోలాహలంగా ప్రమాణస్వీకారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చందుపట్ల సర్పంచ్ గొల్లమందుల ప్రసాద్, రఘునాధబంజర సర్పంచ్ కుక్క అర్జున్‌రావు, పేరువంచ సర్పంచ్ అనూషరెడ్డి, ముగ్గు వెంకటాపురం సర్పంచ్ పువ్వారపు విజయరావు, నారాయణపురం సర్పంచ్ అంకిరెడ్డి కనకదుర్గ, పుల్లయ్యబంజర సర్పంచ్ పెద్దబోయిన కృష్ణవేణి, లింగాల సర్పంచ్ దేవరపల్లి అరుణ, యర్రబోయినపల్లి సర్పంచ్ సింగిశాల పద్మ, చెన్నూరు సర్పంచ్ పాలెపు లక్ష్మీకాంతమ్మ, పెద్దకోరుకొండి సర్పంచ్ వేము రత్తమ్మ, చిన్నకోరుకొండి సర్పంచ్ నామా రాధ, తెలగవరం సర్పంచ్ దంతాల సీతానాగలక్ష్మి, మర్లపాడు సర్పంచ్ మోదుగు యశోద, పోచవరం సర్పంచ్ నండ్రు అన్నపూర్ణ, తాళ్లూరు సర్పంచ్ సుబ్బారావు, పడమటి లోకవరం సర్పంచ్ కళ్యాణం కొండల్రావు, మద్దులపల్లి సర్పంచ్ శీలం సత్యనారాయణ రెడ్డి, ముచ్చవరం సర్పంచ్ గంగవరపు వెంకటేశ్వరరావు, యెన్నవల్లి సర్పంచ్ కొండపల్లి శ్రీమన్నారాయణ, పాయకూరు సర్పంచ్ ఊట్కూరు రమాదేవి, లోకవరం సర్పంచ్ పెద్ద లచ్చిరాం, కిష్టయ్య బంజర సర్పంచ్ పెద్దబోయిన ప్రమీళ, కప్పలబంధం సర్పంచ్ నందిగామ ప్రసాద్ తదితర సర్పంచ్‌లందరూ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు.