Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఖమ్మంలో ప్రారంభించనున్న మంత్రి అజరు
- జిల్లా వ్యాప్తంగా 4,74,116 చీరలు
నవతెలంగాణ-ఖమ్మంప్రతినిధి
జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 21మండలాల్లోని 584 గ్రామపంచాయతీల్లో నేటి నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 4,74,116మంది మహిళలకు పంపిణీ చేయనున్నారు. కాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ నేడు ఉదయం 10గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లాలోని ప్రతీ మండలం లోనూ ఆయా పంచాయతీల్లో చీరల పంపిణీ చేస్తారు. జిల్లాలోని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యం లో ఆహార భద్రతా కార్డుల్లో పొందు పరిచిన మహిళల వయస్సు ఆధా రంగా 18ఏండ్లు నిండిన వారికి ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా గతేడాది మాదిరిగానే ఒక్కో మహిళకు ఒక చీరను పంపిణీ చేస్తారు.
నేడు మంత్రి పర్యటన వివరాలు..
ఉదయం పదిగంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో బతుకమ్మ చీరల పంపిణీని ఆరంభించిన అనంతరం మంత్రి పువ్వాడ అజరుకుమార్ 10.30గంటలకు ఖమ్మం మామిళ్ల గూడెంలోని బాలభవన్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 11గంటలకు ముదిగొండ మండలంలోని ఉన్నత పాఠశాలలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.30గంటలకు ముదిగొండ మండలంలో జరుగుతున్న పంచాయతీల 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు కూసుమంచి మండలంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 4.15గంటలకు నాయకన్‌గూడెం, నారాయణగూడెం గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జిల్లాలో వివిధ మండలాల్లో నేటి నుంచి పంపిణీ చేయనున్న చీరలు...
మండలం కేటాయించిన చీరలు
కామెపల్లి 15,697
ఖమ్మం అ 77,042
ఖమ్మం రూ 27,617
కూసుమంచి 21,763
మధిర 23,016
ముదిగొండ 21,344
నేలకొండపల్లి 21,005
సింగరేణి 19,208
తల్లాడ 19,390
తిర్మలాయపాలెం 23,405
వేంసూరు 16,317
వైరా 18,149
ఎర్రుపాలెం 17,637
బోనకల్ 15,448
చింతకాని 18,376
ఏన్కూరు 12,088
కల్లూరు 23,536
కొణిజర్ల 21,743
పెనుబల్లి 18,660
రథునాథపాలెం 18,170
సత్తుపల్లి 24,505