Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడిగా కోటేశ్వరరావు
నవతెలంగాణ-జూలూరుపాడు
తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా జూలూరుపాడుకు చెందిన ముదిగొండ కోటేశ్వర రావును మంగళవారం నియమించారు. ఈమేరకు బీసీ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయకుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధి కారమే దిశగా చేస్తున్న పోరాటాల్లో భాగంగా జిల్లాలోని బీసీలను చైతన్య పరుస్తు వారి హక్కుల సాధన కోసం తమ వంతు కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తానన్నారు.