Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
మండల పరిధిలోని నాగులవంచ, చింతకాని సహకార సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చింతకాని సహకార సంఘం చైర్మెన్ ఎన్నిక విషయంలో ఆదివారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటంతో టీఆర్ఎస్ జిల్లా పెద్దల జోక్యంతో సోమవారం ఎన్నిక ఏకగ్రీవమైంది. చైర్మెన్‌గా నాగిలిగొండ గ్రామానికి చెందిన 6వ వార్డు డైరక్టర్ కొండపల్లి శేఖర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారి తెలిపారు. వైస్ చైర్మెన్‌గా సీపీఐ(ఎం)కు చెందిన 4వ వార్డు డైరక్టర్ మాదిన్ని రవికుమార్, 11వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి దేవరిపల్లి తులశమ్మ నామినేషన్లు దాఖలు చేయగా దేవరపల్లి తులశమ్మ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో వైస్ చైర్మెన్‌గా మాదిన్ని రవికుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
నాగులవంచ సహకార సంఘం చైర్మెన్‌గా 7వ వార్డు డైరెక్టర్ నల్లమోతు శేషగిరి ఎన్నికయ్యారు. ఎన్నిక విషయంలో నాగులవంచ గ్రామానికి చెందిన 1వ వార్డు డైరక్టర్ అంబటి ఆనందరావు, పాతర్లపాడు కు చెందిన 7వ వార్డు డైరక్టర్ నల్లమోతు శేషగిరి నామినేషన్లు దాఖలు చేశారు. బ్యాలెట్ ఎన్నికల్లో నల్లమోతు శేషగిరికి 8 ఓట్లు రాగా అంబటి ఆనందరావుకు 5 ఓట్లు పోలయ్యాయి. దీంతో 3ఓట్ల మెజార్టీతో నల్లమోతు శేషగిరి చైర్మెన్ పదవికి ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి రేపల్లెవాడ గ్రామానికి చెందిన 6వ వార్డు డైరక్టర్ పాలకుర్తి వెంకటేశ్వర్లు, తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన 13వ వార్డు డైరక్టర్ నాదెండ్ల వెంకటరత్నం నామినేషన్లు దాఖలు చేయగా పాలకుర్తి వెంకటేశ్వర్లు 2ఓట్ల మెజార్టీతో వెంకటర త్నంపై విజయం సాధించి ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు.