గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 31-36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19-27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.