ఆధునిక సాంకేతిక విధానం వేగంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లో లాగే వ్యవసాయంలోనూ ఈ పరి జ్ఞానం తనదైన ముద్రవేసుకుంది. వ్యవసాయ చట్టాలు, వాతావరణ వివరాలు, పంటలకు ఆశించే తెగుళ్లు.. వాటి పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న మొబైల్స్‌తోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. సమస్త సమాచారం తెలుసుకునే వీలుంటుంది.
- వివిధ రకాల పంటలు, ధాన్యాలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల గురించి తెలిపేందుకు 'క్రాప్ ఇన్ఫో యాప్' అందుబాటులో ఉంది. నేల తయారీ, విత్తన మోతాదు, పంటకాలం, రకాలు, నాటే సమయం, ఎరువుల కాంబినేషన్, సమగ్ర పోషకాల అందజేత, నీటి పారుదల, కోతలు, దిగుబడి తదితర అంశాలపై ఇది సూచనలు అందిస్తుంది.
- అగ్రిపోర్టల్ అనే యాప్ ద్వారా దేశంలోని ముఖ్యమైన మర్కెట్లలో కూరగాయలు, ధాన్యాలు, పండ్ల ధరలు తెలుసుకోవచ్చు. వాతావరణ విశేషాలుసైతం సులువుగా అర్థమయ్యేలా ఇందులో పొందుపర్చారు.
- పంటలను ఆశించే వివిధ రకాల తెగుళ్లు, వాటి నివారణ గురించి తెలుసుకునేందుకు 'డిసీస్ ఐడీ' యాప్ దోహదపడుతుంది. తెగుళ్లు, వాటి నివారణ అంశాలను ఫొటోలు సహా చక్కగా వివరిచారు. అయితే... ఇందులో మన దేశంలో పండే కాయగూరల విషయాలు తక్కువగా ఉన్నాయి.
- వివిధ రకాలైన పంటల్లో వచ్చే కలుపు మొక్కలు, వాటి నివారణా చర్యలను చక్కగా వివరించారు. దాదాపు వందల సంఖ్యలో ఉన్న కలుపు మొక్కల సమాచారం, జీవిత కాలం అంశాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అగ్రిప్రెసిషన్ యాప్ ద్వారా మొబైల్‌తోనే పొలం విస్తీర్ణాన్ని కొలవొచ్చు.
- వ్యవసాయ సూచనలు, ముఖ్యమైన సల హాల కోసం అగ్రిప్లాజా పేరిట యాప్ అందు బాటులో ఉంది. టవూట, బం గాళాదుంపల సాగుపై నిపుణులు అందుబాటులోకి వస్తారు. తెగులు సోకిన భాగాన్ని ఫొటో తీసి వారికి అప్లోడ్ చేసిన కొద్ది సేపటికి వాటి నివారణ వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందుతాయి.
- భారతదేశంలో వ్యవసాయ చట్టాలు అనేకున్నాయి. నాణ్యమైన ఎరువుల కొనుగోలు, నకిలీ విత్తనాలు, ఆగ్రో సేవలు, రైతుకు చట్టపరమైన భద్రత తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ ఆక్ట్ పేరిట ఉన్న ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- వారం రోజుల వరకు వాతావరణంలో కలిగే వూర్పుల ను ఆక్యువెదర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆం డ్రాయిడ్ ఫోన్లను వాడేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో ఉన్న సిమ్ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇంటర్నెట్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ముఖ్యంగా పురుగుల వుందులను పిచికారీ చేసిన వెంటనే వర్షం పడితే రైతులకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈయాప్ ద్వారా వర్ష సూచన లు, గాలిలో తేమాశాతం, ఎన్ని డిగ్రీల ఎండ కాస్తోంది వంటి విలువైన విషయాలు తెలుసుకోవచ్చు.
- మోత్కూరు యాదయ్యన
Authorization