- పురుగు మందులు వాడేటప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- మందును వాడేటప్పుడు రక్షణ కల్పించే వస్త్రాలు ధరించాలి.
- సిఫార్సు చేసిన పరిమాణాన్ని సరిగ్గా కొలిచి వాడాలి.
- నీటిలో కలిపేటప్పుడు కర్రతో బాగా కలియబెట్టాలి.
- మందు చిందకుండా గరాటును ఉపయోగించాలి.
- మందు డబ్బాలను నీరు లేదా ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించొద్దు.
- గాలి వీచే దిశలోనే మందును పిచికారీ చేయాలి.
- స్ప్రేయర్ నాజిల్ని శుభ్రపర్చడానికి నోటితో గాలిని ఊదకండి.
- పచికారీ చేసేటప్పుడు తినకండి. ఎలాంటి ద్రవపదార్థాలు తీసుకోకండి. పొగ తాగకండి.
- చిల్లుపడిన, పాడైపోయిన స్ప్రేయర్ని లేదా డస్టర్ని వాడకండి.
- ప్రమాదవశాత్తు ముందు పడితే మలినమైన దుస్తులు, శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
- పురుగు మందును పిల్లల చేత పిచికారీ చేయించొద్దు.
- మందు చల్లుతున్న ప్రదేశం వద్ద ఆహార పదార్థాలు ఉంచొద్దు.
- ఆహారం తీసుకునే ముందు, ఏదైనా ద్రవపదార్థం తాగే ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- ఆహార పదార్థాలతోపాటు పురుగు మందులను రవాణా చేయొద్దు.
- పురుగు మందులను సురక్షిత ప్రదేశంలో తాళం వేసి భద్రపర్చాలి.
- పిల్లలకు అందకుండా నిల్వ చేయాలి.
- అసలైన ప్యాకింగ్తోనే మందును కొనండి.
- ఉపయోగించే ముందు లేబుల్, ఇతర వివరాలను పూర్తిగా చదవండి.
- విష ప్రభావం కలిగితే ప్రాథమిక చికిత్స చేసి డాక్టర్ని సంప్రదించాలి.
- వైద్యం చేయించుకునేటప్పుడు డాక్టరుకు పురుగు మందు డబ్బా వివరాల కరపత్రాన్ని చూపించాలి.
- ఖాళీ డబ్బాలను విరగ్గొట్టి భూమిలో పాతిపెట్టండి.
- మందు చల్లడం పూర్తయిన తర్వాత స్నానం చేయాలి. దుస్తులు విడిచి వెంటనే ఉతకాలి.
- మందు చల్లే సమయంలో పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- మందు చల్లిన పొలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి.
Authorization