చలికాలంలో పశువుల శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసు కుంటాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ప్రక్రియ మందగిస్తుంది. దీంతో అవి ఆహారాన్ని సరిగా తీసుకోలేకపోతాయి. దీని వల్ల పాల దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది. కాబట్టి రైతులు చలి కాలంలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి పశువులను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి.
- పాడి పశువులకు అనుకూలంగా ఉండే సరైన గృహావసతిని కల్పించాలి. చలి గాలులకు గురికాకుండా పరిశుభ్రమైన కొట్టాలలోనే కట్టేసి ఉంచాలి. పశువులను ముఖ్యంగా దూడలను ఆరుబయట కట్టేయొద్దు. -
- వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతకంటే పాకలలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. - ఈదర గాలి నిరోధించడానికి వాతావరణ ఉష్ణోగ్రత 10 సెంటీగ్రేడ్ డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ గొనె సంచులతో పరదాలు కట్టాలి.
- ప్రతి పశువుకు 5-6 కిలోల ఎండు గడ్డిని పక్క గా (బెడ్) పర వాలి. ఈ కాలంలో పశువులను ఉంచే కొట్టాలలో నేల, తేమను త్వరగా పీల్చుకునే విధంగా లేదా ఆరిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
- చలికాలంలో తొట్లు లేదా ట్యాంకుల్లో నిల్వ చేసిన నీళ్లు ఉదయాన్నే చాలా చల్లగా ఉంటాయి. ఇలాంటి నీటిని పశువులకు ముఖ్యంగా దూడలకు తాగించకూడదు. అప్పటికప్పుడు నీటిని నూతి నుంచి లేదా బోరు నుంచి తోడుకొని తాగించాలి.
- చలికాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాలి. మేత సరిగా తినక పోతే పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాం సకృత్తులు తక్కువగా ఉండాలి.
- దాణాను ఎప్పటికప్పుడు తాజాగా ఉండేటట్టు తయారు చేసుకొని వినియోగించుకోవాలి. దాణాతో పాటు విటమిన్లతో కూడిన ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజూ వాడడం వల్ల పాల జ్వరం, పడక జబ్బు వంటి రోగాలను నివారించొచ్చు.
- చలికాలంలో పాడి పశువుల పొదుగు పైన పగుళ్లు ఏర్పడి పుండ్లుగా మారే ప్రమాదముంది. సకాలంలో పగుళ్లను గుర్తించి 'బోరో గ్లిసరిన్' పేస్టును పూత ముందుగా వాడాలి.
- చలికాలంలో దూడలకు నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైపర్ జీన్ / అల్బెన్దజోల్ మందును తాగించాలి.
- చలికాలంలో దూడలు మలబద్ధకంతో బాధ పడకుండా లిక్విడ్ పారఫిన్ లేదా ఆముదం తాగించాలి.
- ఈ కాలంలో చలి గాలులు, మంచు కురవడం వల్ల నిమోనియా సోకె ప్రమాదముంటుంది.
- గొంతువాపు, గిట్టలు మెత్త బడడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దూడలకు రెండు నెలల వయసులో గాలికుంటు, 4-6 నెలల వయసులో గొంతువాపు, జబ్బవాపు వ్యాధులó నిరోధక టీకాలు వేయించాలి.
-డాక్టర్ జె.సాయి ప్రసన్న
అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశు వైద్య కళాశాల- కోరుట్ల
Authorization