చాలామంది రైతులు వేసిన పంటలే మళ్లీ వేస్తూ ఉంటారు. తద్వారా తీవ్ర నష్టపోతుంటారు. పంట మార్పిడి వల్ల ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోరు. ఒకరినొకరు అనుసరిస్తుంటారు. మంట మార్పిడి చేయకపోవడం వల్ల చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతుందనే విషయాన్ని గ్రహించరు.
ప్రయోజనాలు
నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది.
భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది.
చీడపీడలు దూరమవుతాయి.
సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గుతుంది.
శిలీంధ్ర వ్యాధులను దూరం చేయొచ్చు.
బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది.
కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు.
పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.
ఇవి పాటించాలి...
జొన్న పంట సాగుచేసిన పొలంలో మిరప వేయొద్దు.
వేరుశనగ సాగుచేసిన తర్వాత మళ్లీ అదే పంట వేసుకోవద్దు. దీనివల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగ పచ్చ పురుగు ఆశించొచ్చు.
వేరుశనగ తర్వాత ఆముదంలో పంట మార్పిడి చేసుకోవచ్చు.
నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, ఉలవలు, మినుము, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. అందుకు వాటిని పంట మార్పిడి చేయొద్దు.
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి.
ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలవలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి. కలుపు మొక్కలను నివారించొచ్చు.
పప్పుధినుసులు పైర్లపై వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడతాయి. ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేలను సారవంతం చేస్తాయి. ఈ జాతి పంటలను పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు.
పత్తి పైరును మునుము, పెసర వంటి పంటతో మార్పిడి చేయడం వల్ల దోమ ఉధృతి తగ్గుతుంది.
వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి. దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధ తిని తగ్గించొచ్చు.
వరిపైరు తర్వాత పప్పుధాన్యాల పైర్లను నూనె గింజల పైర్లను పండించడం వల్ల వరి పంటను ఆశించే టుంగ్రోవైరస్, దోమపోటులను నివారించొచ్చు.
భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
తేలికపాటి నేలలు, ఎర్ర, ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి.
వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి.
బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసే ఏడాదిలో పెండు పంటలు పండించుకోవాలి.
Authorization