గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 34-38 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 17-25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది.
వరి:వరిలో అగ్గి తెగులు నివారణకు 0.6 గ్రా.ట్రైసైక్లోజోల్ లేదా 1.5 ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవదిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావ రణం దోమపోటు ఉధృతితని బట్టి డైనోటేప్యూరాన్ 0.4 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో కంకినల్లి ఉనికి గమనించడమైంది. నివారణకు స్పైరోమేసిఫిన్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్న:మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితు లలో పేనుబంక ఆశించే సూచనలున్నాయి. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పశుగ్రాస పంటలు:నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చ. వరిమాగాణుల్లో జొన్న, సజ్జ, మొక్కజొన్న, పిల్లిపెసర, జనుము, ఉలవలు వేసుకోవచ్చు.
తోటలు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలోమామిడిలో తేనె మంచు పురుగులు, పక్షి కన్ను తెగులు గమనించినట్టయితే నివారణకు 1.0 మి.లీ లాంబ్డా సహలోత్రిన్. 1గ్రా. కార్బండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉకుముడత పురుగు నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 0.5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 మి.లీ ప్రోఫినోఫాస్ మందును లీటరు నీటికి కలిపి లేత చిగుర్ల దశలోనే 10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.
నల్లి:3 మి.లీ నీటిలో కరిగే గంధకం లేదా 5.0 మి.లీ డైకోఫాల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్ పంటలో డైమండ్ రెక్కల పురుగు గమనించడమైంది. నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ స్పినోసాడ్ మందును లీటరు నీటిలో కలిపి పంట కోతకు 15 రోజుల ముందు పిచికారి చేయాలి.
పశుపోషణ: గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి, అవులు, బర్రెల్లో గొంతువాపు వ్యాధి, ఆవులు, ఆంబోతులలో జబ్బవాపు వ్యాధి సోకేందుకు అనుకూలం కనుక వీటి నివారణకు టీకాలు వేయించాలి.
Authorization