ప్ర. వేరుశనగ ఆకు పుసుపు పచ్చగా మారి గిడసబారి పోతోంది నివారణ చెప్పండి?
- నర్సింహులు, గ్రా, శ్రీరంగపురం, మం, వనపర్తి జిల్లా
జ. ఈ తెగులు రబీలో ఎక్కువగా కనపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో ఎరుపు ఇటుక రంగు గల చిన్న మచ్చలు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. నివారణకు క్లోరోథలోనిల 2 గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ 1 మి.లీ లేదా మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్ర. ఆవాలులో పేనుబంక నివారణ చెప్పండి? - సంజీవ్, భైంసా గ్రా, మం, నిర్మల్ జిల్లా
జ. పేనుబంక సోకిన ఆకులు ముడుచుకుపోయి మొక్కలు వడలిపోయి చనిపోతుంటాయి. నల్లటి జిగురు పదార్థ విసర్జించడం వల్ల మొక్కలు ఆహారం తయారు చేసుకోలేని పరిస్థితుల వలన ఎదుగుదల ఉండదు. నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్ర. మినుములో బూడిద తెగులు నివారణ తెలపండిి?
- మహేందర్, పరకాల గ్రా,మం, వరంగల్ (రూరల్) జిల్లా
జ. ఈ తెగులు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్నచిన్న మచ్చలుగా కనిపిస్తాయి. క్రమంగా పెద్దగై ఆకుల కింది భాగాలకు, కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. నివారణకు మైక్రోబుటానిల్ 1గ్రా. లేదా డైనోకాప్ 1 మి.లీ లేదా పెనన్కొనజోల్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్ర. మామిడిలో పూత రాలుతోంది నివారణ చెప్పండి?
- శ్రీశైలం, సూర్యాపేట్ మం జిల్లా
జ. ప్లానోఫిక్స్ 2 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 2,4-డి 1గ్రా.100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ప్ర. పుచ్చలో కలుపు నివారణ తెలపండి?
- రమేష్, శంకరంపేట-ఎ, మెదక్ జిల్లా
జ.పెండి మిథాలిన్ మందును ఎకరానికి 1.25 లీ. లేదా అలాక్లోర్ 1.0 లీ, నాటిన 24 గంటల్లోపు తరువాత 48 గంటలలోపు పిచికారి చేసుకోవాలి.
Authorization