రాష్ట్రంలో సుమారు 48లక్షల ఎకరాలకుపైగా వరి సాగవుతున్నది. అతి ముఖ్యమైన ఆహార పంట. దాదాపు 70శాతం మంది చిన్న సన్నకారు రైతులు 2.5ఎకరాలకన్నా తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. భారతదేశంలో సగటు దిగుబడులు ఎకరానికి 880కిలోలు (70కిలోల బస్తాలు-12.5) ఉండగా తెలంగాణ జిల్లాల్లో 1176కిలోలుగా (70కిలోల బస్తాలు-17) నమోదు అవుతున్నాయి.తెలంగాణలో ఖరీఫ్ (మే -జూలై నుంచి నవంబర్, డిసెంబర్ వరకు) రబీలో (నవంబర్ - ఏప్రిల్ వరకు) ప్రధానంగా వరి పంటను రైతులు సాగు చేస్తారు.
అనువైన రకాలు - వరి రకాల గుణగణాలు
ఖరీఫ్
దీర్ఘకాలిక రకాలు ( 140 - 150 రోజులు)
సాంబమసూరి (బిపిటి - 5204) సన్నగింజరకం. పురుగులు, తెగుళ్లను తట్టుకోలేదు. సిద్ధి (డబ్ల్యుజిఎల్-44 ఉల్లికోడును తట్టుకునే సన్న గింజ రకం, స్వర్ణ (ఎంటియు 7029), తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే బ్యాక్టీరియ ఎండాకు తెగులును తట్టుకునే రకం.
మధ్యకాలిక రకాలు (130 నుంచి 135రోజులు) కృష్ణ (ఆర్ఎన్ఆర్- 2458 అగ్గితెగులును తట్టుకునే సన్న గింజ రకం, పొలాస ప్రభ (జెజిఎల్) కరీంనగర్ సంబ 'జగిత్యాల మసూరి (కెజిఎల్ 11470) ఉల్లికోడును తట్టుకునే సన్నగింజ రకం, కరీంనగర్ సాంబ (జెజిఎల్ 3855) ఉల్లికోడును తట్టుకునే సన్నగింజ రకం, ప్రాణహిత (జెజిఎల్ 11727) ఉల్లికోడును తట్టుకునే సన్నగింజ రకం, వరంగల్ సాంబ (దబ్ల్యుజిఎల్ 14) బ్యాక్టీరియా ఎండాకు తెగులును తట్టుకునే సన్న గింజ రకం, వరంగల్ సన్నాలు (డబ్ల్యు.జిఎల్ 32100) సన్నగింజ రం, విజేత (ఎంటియు 1001) అగ్గితెగులును తట్టుకునే సన్నగింజ రకం, ఆర్ఎన్ఆర్ ఎం -7
స్వల్పకాలిక రకాలు (120 - 125 రోజులు) కాటన్దొర సన్నాలు ( ఎంటియు 1010)సుడి దోమ, అగ్గి తెగులును తట్టుకునే రకం, తెల్ల హంస (ఆర్ఎన్ఆర్ 10754) చలిని తట్టుకునే రకం, జగిత్యాల సన్నాలు ( జెజిఎల్ 1798) ఉల్లికోడు, చలిని తట్టుకునే రకం, అంజన (జెజిఎల్11118) ఉల్లికోడు, చలిని తట్టుకునే రకం, శీతల్ ( డబ్ల్యుజిఎల్ 283)చౌడు, సుడి దోమ, చలిని తట్టుకునే రకం, జగిత్యాల సాంబ ( జెజిఎల్ 3844), ఎర్రమల్లెలు ( డబ్ల్యుజిఎల్ 20471) ఉల్లికోడును తట్టుకునే ఆరుతడి సాగుకు అనువైన రకం, రాజేంద్ర ( ఆర్ఎన్ఆర్ 12329) చలిని, బెట్టను తట్టుకునే రకం, ప్రద్యుమ్న (జెజిఎల్ 17004) ఉల్లికోడు తట్టుకునే సన్నగింజ రకం, వరాలు (డబ్ల్యుజిఎల్ 14377)ఉల్లికోడు, చలి, బెట్టను తట్టుకునే రకం, సుమతి ( ఆర్ఎన్ఆర్ 18833 - 140 రోజులు)బాస్మతి గింజ లక్షణాలు గల రకం, సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465 -130రోజులు)సువాసన గల సన్న గింజ రకం.
Authorization