వ్యవసాయ క్షేత్రం ప్రధాన యంత్రంగా మారింది ట్రాక్టర్. దుక్కి దున్నడం దగ్గర నుంచి పంట చేతికందే వరకూ దీన్ని వాడటం అనివార్యమైంది. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగాక ట్రాక్టర్ వాడకు ప్రాధాన్యం పెరిగింది. దాదాపు అందరు రైతులూ ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న రైతులు, వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్న రైతులు ట్రాక్టర్‌ను కొని పనులు సొంతంగా నిర్వహించుకుంటున్నారు. అయితే అన్ని పంటలకూ, అన్ని సీజన్లలో ఈ యంత్రం ఉపయోగపడుతోంది. నిరంతంరం ఉపయోగించే యంత్రం కాబట్టి తగిన జాగ్త్రలూ అవసరమే. ట్రాక్టర్‌ను కొనాలన్నా, దాన్ని వాడాలన్నా అది ఎక్కువ కాలం మన్నికగా ఉండాలన్నా జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందామా ?
1. క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
నిర్వహణ సరిగ్గా లేని ట్రాక్టర్ 25శాతం డీజిల్ వృథా చేస్తుంది. డ్రైవింగ్‌లో ఏదైనా అనుమానం కలిగితే అధీకృతమైన గ్యారేజీ లేదా డీలర్‌ను సంప్రదించాలి.
2. డీజిల్ కారిపోవడాన్ని అరికట్టండి
ప్రతి సెకనుకు ఒక బొట్టుచొప్పున కారినా మీరు సంవత్సరానికి 2వేల లీటర్ల డీజిల్ నష్టపోతారు. కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్, పంపు, ఇంజక్టర్,లైన్స్ ప్రతిరోజూ తనిఖీ చేయాలి.
3. ట్రాక్టర్ నిలిపినప్పుడు ఇంజన్ ఆపుచేయాలి
ఇంజన్ పని చేస్తూ డ్రైవర్ నిలబడి ఉన్నట్లయితే ప్రతి గంటకు ఒక లీటరు డీజిల్కుపైగా వృథా అవుతుంది. బ్యాటరీ, డైనమో,సెల్ఫ్స్టార్టర్లను ఎప్పుడూ పని చేసే స్థితిలో ఉంచుకోవాలి.
4. సరైన గేర్‌లోనే నడిపించాలి
తప్పుడు గేర్వేసినట్లయితే 30శాతం డీజిల్ అధికంగా ఖర్చవుతుంది. పొలం పని ఉత్పాదన తగ్గిపోతుంది. బరువు లాగడానికి మూవ్‌మెంట్‌తో గేర్ మార్చుకోవాలి. ట్రాక్టర్ పొగ వదులుతుందంటే ఓవర్‌లోడ్ అయిం దని అర్ధం.
5. పొగ అధికంగా వదిలితే..
నాజిల్స్ పరిక్షీంచుకోవాలి. ప్యూయల్ ఇంజక్షన్ రీకేలిబ్రేట చేయండి. రెగ్యులర్‌గా సర్వీస్ చేయాలి. అధికలోడ్ వేయకూడదు.
6.మురికి మీ ఇంజన్‌కు ప్రథమ శత్రువు
సాధారణంగా దుమ్ముధూళిలోనే ట్రాక్టర్లు పని చేయాల్సి ఉంటుంది. కనుక మంచి ఎయిర్ ఫిల్టరేషన్ చాల ముఖ్యం. ఫిల్టర్ కాని ఎయిర్ వల్ల మామూలు దానికంటే సిలిండర్ బోర్ 45 రెట్లు త్వరితంగాను, పిస్టన్ రింగులు115 రెట్లు త్వరితంగా అరిగిపోతాయి. కనుక నాణ్యమైన ప్యూయల్ ఫిల్టర్లనే వాడాలి.
7. చక్రాలు జారిపోతూ ఉంటే డీజిల్ వృథా అవుతుంది.
వాటర్ బ్యాలెస్ట్లు లేదా పోత ఇనుము బరువులు చేర్చడం ద్వారా ట్రాక్టర్ చక్రాలు జారిపోకుండా చూడాలి. చక్రం జారడం అతి తక్కువగా ఉండే విధంగా సరైన బరువుని జోడించండి. పొలం పనులు పూర్తికాగానే బ్యాలెస్ట్లు తొలగించాలి.
8. అరిగిపోయిన టైర్లు అలాగే వాడితే లాగుడు శక్తి తగ్గుతుంది
సకాంలో టైర్లను రీలగ్ చేయాలి. టైర్లను తిరిగి అమర్చేటప్పుడు ముందు నుంచి చూసినట్లయితే 'వి' ట్రేడ్లు కిందివైపు ఉండేటట్టు జాగ్రత్త వహించాలి. సరైన టైర్ ప్రెషర్ ఉండేలా చూసుకోవాలి.రోడ్లమీద, పొలాల పనులకు వివిధ టైర్ ప్రెషర్లను సిఫార్సు చేశారు. మీ ట్రాక్టరు పుస్తకం చూడండి. లేదా డీలర్‌ను సంప్రదించాలి.
9. లాగుడు శక్తి, బరువుతో సమానంగా ఉండేలా చూసుకోవాలి
ఇంజన్ యెక్క హార్స్‌పవర్‌తో సమానంగా ఉండేటట్టు పరికరం సైజుని,ట్రాక్టర్ని పని చేయించే స్పీడ్‌ను ఎంచుకోండి. మీ ట్రాక్టర్ పొగ వదలకుండా వీలైనంత అత్యధిక గేర్‌లో నడపండి. ట్రాక్టర్ టాప్‌గేర్‌లో కూడా పూర్తి థ్రాటిల్ మీద ఎక్స్‌లరేట్ అయినట్లయితే మీ పరికరం బాగా చిన్నదన్నమాట. పరికరాలు మార్చేటప్పుడు నిపుణుల సూచనలు పాటించాలి.
10. ముందుగా నిర్ధారించుకొని పొలంలో నడపాలి
ఇంజన్ పని చేస్తుండగా ట్రాక్టర్ నిలిచిపెట్టడం, వెనక్కి, ముందు, వంకలు తిప్పకుండా చూసుకోవాలి. పొలంలోకి ట్రాక్టర్ వెళ్లకముందే ఒక స్కెచ్ వేసుకొని దింపాలి. చిన్న చిన్ని సాళ్లలో కాకుండా భారీ సాళ్లుగా ఎంచుకోవాలి.
ట్రాక్టరు వాడకంలో లేనప్పుడు ఇంజన్ స్విచ్ఆఫ్ చేయాలి
ప్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను సరిగ్గా మెయింటన్ చేయాలి
సమయానుసారం తరచూ ఎయిర్ ఫిల్టర్ శుభ్రం చేసుకోవాలి
ట్రాక్టర్‌ను సరైన గేర్‌లోనే నడిపించాలి.
Authorization