సాధారణంగా రైతులు కూరగాయల నారును సొంతంగా పొలంలోనే పెంచి నాటుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొందరు రైతులు ప్లగ్ ట్రేలలో నారును పెంచి, విక్రయిస్తున్నారు.
నారును ప్లగ్ ట్రేలలో పెంచడం వల్ల ఉపయోగాలు
లేత మొలకలకు, వేర్లకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. నారు ఆరోగ్యంగానూ బలంగానూ పెరుగుతుంది. నారు మొక్కలన్నీ ఒకే పరిమాణంలో పెరుగుతాయి. మొక్కలు బాగా ఏనుకుంటాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ ట్రేలను పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కులీల ఖర్చులు, స్థలం, ఇతర ఖర్చులు తగ్గుతాయి.
ప్లగ్ ట్రేలను ప్లాస్టిక్ లేదా స్టైరోఫోం లేదా చెక్క లేదా తేలికపాటు లోహపు రేకుతో తయారు చేస్తారు. ప్రతిగది, గుంటకు రంధ్రం ఉండి నీరుపోయే సౌకర్యం ఉంటుంది. సాధారణంగా తెల్లరంగు కంటే నల్లరంగు ట్రేలకు ప్రాధాన్యం ఉంటుంది.
ట్రేల పరిమాణం
1. 72 గుంటలు(గదులు) ట్రే. టమాట, వంగ, మిరప నారునుపెంచేందుకు అనుకూలం
2. 128 గుంటలు (గదులు) ట్రే. శీతల పంటలైన క్యాబేజీ, క్యాలీప్లవర్, బ్రాకోలి నారు పెంచేందుకు అనుకూలం. ఒక్కోగది పరిమాణం 40 నుంచి 90 క్యూ.సెం.మీ
సాధారణంగా గదులు, గుంటలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటాయి కొన్ని సార్లు త్రిభుజాకారం లేదా షడ్బుజ లేదా గుండ్రంగాను ఉంటాయి.
ట్రేలలో నింపు వేరు మిశ్రమం
దీని కోసం మట్టిని అస్సలు వాడరాదు. ఆరోగ్యకరమైన, బాగా మాగిన కొబ్బరి పీచు, వర్మిక్యులైట్, పర్లెట్ను 3:1:1 నిష్పత్తిలో బాగా కలుపుకుని ట్రేలను నింపాలి.
విత్తే పద్ధతి: ప్రతి గుంటలో వేరు మిశ్రమాన్ని నింపాలి. ఒక గింజ ఒక గుంటలో విత్తి పైన కోకోపీట్‌ను కప్పి రోజ్క్యాన్తోనీరు చల్లాలి. పది ట్రేలను ఒకదాని మీద మరొక్కటి పెట్టి జమాయించాలి. దీనిపై పాలిథీన్ షీట్‌ను కప్పి
3 నుంచి 6 రోజులుంచాలి. కోకోపీట్ వాడడం వల్ల నీరు ఎక్కువ సార్లు పోయాల్సిన పనిలేదు. ఆరు రోజుల తర్వాత పాలిథీన్ షీటు తీసి ట్రేలను విడివిడిగా పెట్టుకోవాలి. ట్రేలను తెగుళ్లు రాకుండా కాపర్ ఆధారిత మందు ద్రావణం 3గ్రా.లీ చొప్పున తో తడపాలి.
ప్లగ్ పుషర్లు నారును సులభంగా ట్రేల నుండి తీయడానికి వాడుతారు. పంటను అనుసరించి 4నుంచి 6 వారాల వయస్సు గల నారును ప్రధాన పొలంలో నాటుతారు. నమూనా కోసం ఈ పద్ధతిలో టమాట నారును పెంచే విధానాన్నా పరిశీలిద్దాం.
ప్లగ్ ట్రేలలో అమాట నారు పెంపకం
- టమాట విత్తనాలను 5నుంచి 6 వారాల ముందు ట్రేలలో విత్తుకోవాలి.
- విత్తడానికి ముందు ట్రేలను 10శాతం బ్లీచింగ్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. (ఒక భాగం బ్లీచింగ్ పౌడరు, 9భాగాలనీటిలో)
- ట్రేగదులను వేరు మిశ్రమ పదార్ధాంతో నింపాలి.
- విత్తనం 1/4లోతులో విత్తుకోవాలి
- ట్రేకు విత్తిన రకం పేరు,తేదీ ఉన్న ట్యాగ్‌ను కట్టాలి.
- 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత, 15.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 16 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రత అనుకూలం.
- ఒక గదిలో ఒక గింజ మాత్రమే విత్తాలి. 7 నుంచి 14 రోజులలో విత్తనం మొలకెత్తుతుంది. రోజుకు 14 గంటల వెలుతురు పడేలా చూడాలి.
- నారు ప్రధాన పొలంలో నాటేందుకు 10 రోజులకు ముందు నారును గట్టి పరిచేలా రోజూ కొన్ని గంటలు ఎండలో పెట్టాలి. నారును బాగా గట్టి పర్చకూడదు. దీని వల్ల మొక్కలు గిడసబారి, పెరుగుదల వేగం తగ్గుతుంది.
గట్టిపర్చిన 21 రోజుల వయసు నారును ప్రధాన పొలంలో నాటాలి.
Authorization