ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రూపొందించి స్వల్పకాలలో రైతు స్థాయిలో ఆదరణ పొందిన ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోన) అనే మిక్కిలి సన్నగింజ, స్వల్పకాలిక, అధిక దిగుబడినిచ్చే వరి రకం. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచేత అధికారికంగా విడుదల చేసింది. ఈ రకం తెలంగాణ సోన పేరుతో భారత ప్రభుత్వం 2016లో నోటిఫై చేసింది. ఈ అధిక దిగుబడి ఇచ్చే రకం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ ప్రాచుర్యం పొంది, అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ రకం హైబ్రిడ్ అని, జన్యుపరమైన లోపాలున్నాయని వ్యవసాయశాఖ విత్తన చట్టం 1996 ప్రకారం నిషేదించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అయిందని తెలిపారు. ఇది వాస్తవం కాదని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా. ఆర్ జగదీశ్వర్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆర్ఎన్ఆర్ వరి రకాన్ని వ్యవసాయ శాఖ నిషేదించలేదని స్పష్టం చేశారు. ఆర్ఎన్ఆర్15048 అనే వరి రకం సాగు చేయడం, అమ్మడం, కొనుగోలు చేయడంలో ఎలాంటి అపోహలు వద్దని, ఈ రకాన్ని సాగుచేసి, రైతులు అధిక లాభాలు అర్జించాలని, నీటి ఆదా చేసుకోవాలని సూచించారు. రైతులు ఏ మాత్రం ఆందోళనకు గురికావద్దని తెలిపారు.
Authorization