వేరుశనగ: రబీ వేరుశనగలో తిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించినట్టు గుర్తించారు. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ది చేయకుండా విత్తిన పరిస్థితుల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
తిక్కా ఆకుమచ్చ తెగులు:ఈ తెగులు పైరు 30 రోజుల్లోపు ఆశిస్తుంది. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు మచ్చలు ఆకుల పైభాగాన ఏర్పడి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఈ మచ్చలు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తెగులు నివారణకు క్లోరోథలోనిల్ 400గ్రా. లేదా టెబ్యుకొనజోల్ 200 మి.లీ ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
మామిడిలో నీటి యాజమాన్యం: పూత, పిందె దశలో ఉన్న మామిడి మొక్కలకు నీటిని సరైన సమయంలో ఇచ్చినట్టయితే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. పది సంవత్సరాల వయస్సు పైబడిన పెద్ద చెట్లకు రోజుకు 50 నుంచి 80 లీటర్ల నీటిని వాతావరణానికి అనుగుణంగా ఇవ్వాలి. మామిడి తోటల్లో పూత బాగా రావాలంటే 3 నెలలు అంటే అక్టోబరు నుంచి డిసెంబరు వరకు బెట్ట అవసరం. పిందె ఏర్పడిన తర్వాత కాయలు బఠాణి గింజ లేదా గచ్చకాయ సైజులో ఉన్నప్పుడు ప్రతి 20 నుంచి 25 రోజులకొకసారి వీరు పెట్టాలి. కాయ కోతకు 20 నుంచి 25 రోజులకు ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. కాయలు పూర్తిగా కోసిన తర్వాత ఒకసారి నీరు పెట్టవచ్చు. దీని వల్ల కొత్త చిగుర్లు వస్తాయి.
మిరప:మిరప పంటను బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరుస్తున్నట్టు గమనించాము. వాతావరణం మబ్బుగా ఉండి, ముసురు వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన ఆకుల మీద గోథుమ రంగు మచ్చలు ఏర్పడి, క్రమేపి అవి పెద్దవై జిగురు వంటి పదార్థం స్రవించబడి నల్లటి గ్రీజువంటి పొద ఏర్పడుతుంది. దీని వల్ల ఆకులు పండుబారి రాలిపోతాయి. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్30 గ్రా.1 గ్రా. స్ట్రైప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
శనగ:రైజోక్టోనియా ఎండు తెగులు (డ్రైరూట్ రాట్ ఈ తెగులు భూమి ద్వారా వ్యాప్తి చెందును. సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి 25 నుంచి 30 డిగ్రీల సెల్సీయస్గా నమోదైనట్టయితే ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది. భూమిలో తేమ బాగా తగ్గినప్పుడు లేదా బెట్ట పరిస్థితుల్లో కూడా తెగులు ఉధృతి పెరుగుతుంది. ఈ తెగులు సాధారణంగా పూత, కాయ సమ యంలో కనబడదు. ఈ తెగులు ఆశించినప్పుడు అక్కడక్కడ ఆకులు పాలిపోయి, మొక్కపైభాగం తలలు వాల్చడం, లేదా మొక్క మొత్తంగా ఎండిపోతుంది. మొక్క తీసి చూసినట్టయితే వేరు నల్లగా మారి, కుళ్లిపోయినట్టు కనిపిస్తుంది. ప్రధాన వేరు మాత్రమే కనబడుతుంది. పిల్ల వేర్లు కనిపించకుండా పోతాయి. దీని నివారణకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రైకోడెర్మా మిశ్రమం 10 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
Authorization