రబీ జొన్న: రబీ జొన్న ప్రస్తుతం కంకి ఏర్పడే దశ నుంచి గింజ ఏర్పడే దశలో ఉంది. ఈ దశ పంటకు సున్నిత దశ కనుక ఒక నీటి తడి ఇవ్వాలి ఈ దశలో గింజ బూజు తెగులు, తేనే బంక తెగులు ఆశించడానికి అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యగా ప్రొపికొనజోల్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రాగి కోత: రాగిలో గింజలు ముదురు గోధుమ రంగుకి మారినా లేదా వెన్నుల దగ్గర ఆకులు పండినట్టుగా కనిపించినా వెంటనే పంట కోతకొచ్చిందని గుర్తించి కంకులను కోసుకోవాలి. పంట కోసిన తర్వాత మెన్నులను 2 నుంచి 3 రోజుల పాటు బాగా ఆరనిచ్చి తర్వాత విడదీయాలి. బాగా ఆరిన గింజలను కర్రలతో కొట్టిగానీ, ట్రాక్టర్ పడపడం ద్వారా కానీ సేకరించాలి. సజ్జ: నవంబరు, డిసెంబరు నెలలో విత్తిన సజ్జ పంట ప్రస్తుతం కోత దశలో ఉన్నది. ఈ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకొస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతి కట్టాలి. కంకులు బాగా ఆరిన తర్వాత ఇతర పంటలకు ఉపయోగించే నూర్పిడి యంత్రాలతో నూర్పిడి చేసుకోవచ్చు.