గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతారణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 41 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
పశుగ్రాస పంటలు
నీటి వసతి గల ప్రాంతంలో పచ్చి మేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. వరి మాగాణుల్లో జొన్న, సజ్జ, మొక్కజొన్న, పిల్లిపెసర, జనుము ఉలవలు వేసుకోవచ్చు.
వరి
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడమైంది. నివారణకు 2గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ క్లోరాంట్రినిల్ప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం చలి మంచు వాతావరణం కనుక అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులను గమనించినట్టయితే నివారణకు ఎకరానికి 0.6గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కెండుసార్లు పిచికారి చేయాలి.
ద్రాక్ష
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో పక్షికన్ను తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రా. ప్రొఫినెట్ మందును లీటరు నీటిలోకలిపి కత్తిరింపుల తరువాత 20 రోజులలోపు పిచికారి చేయాలి. ద్రాక్షలో పెంకు పురుగు గమనించడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోరిపైరాపాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులు ద్రాక్షలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. ఉదృతి గమనించి 2 మి.లీ ఫిప్రోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మామిడి
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తామర, తేనె మంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్, 2.5 మి.లీ వేపనూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మిరప
మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో గుండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.5 మి.లీ ట్రైజోఫోస్ లేదా 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్యుజేరియం ఎండు తెగులు సోకే సూచనలున్నాయి. నివారణకు 3 గ్రా. కాపర్ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రా. కర్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల దగ్గర నేల తడిచే విధంగా పిచికారి చేయాలి. మిరపలో వైరస్ తెగులు ఉధృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఈ వైరస్ వ్యాప్తి వాహకాలైన రసం పీల్చే పురుగులను అదుపు చేయాలి.
కూరగాయలు
ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో తామర పురుగులు కూడా ఆశించేందుకు అనుకూలం. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization