ప్రస్తుతం ఉష్ణో గ్రతలు పెరిగిన తరుణంలో తీగజాతి కూరగాయ పంటల్లో మగపూలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశముంది. దీని నివారణకు గింజ విత్తిన 15 రోజులకు 2 నుంచి 4 ఆకుల దశలో 3 నుంచి 4 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి లేదా ఇథరిల్ 2.5 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే తర్వాత దశలో ఆడపూల సంఖ్య పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
సజ్జ: సజ్జ పంటలో వెర్రి కంకి తెగులు ఉదృతి అధికంగా ఉంది.
పచ్చ కంకి, వెర్రి కంకి తెగులు: ఈ తెగులు సోకిన మొక్కల్లో అకులుగా మారిన పుష్ప గుచ్చం ఏర్పడుతుంది. తెగులు తీవ్ర దశలో మొక్కలు గడసబారి 30 రోజుల్లోపు చనిపోతాయి. ఈ తెగులు నివారణకు విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్కలు 5శాతం మించి ఉన్నట్టయితే మెటలాక్సిల్ 35 డబ్ల్యుఎస్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రాగి
అగ్గితెగులు: ఈ తెగులు ఆశించినప్పుడు ఎదిగిన మొక్కల ఆకులు, కణుపులు, వెన్నులపైన దారపు కండె ఆకారం మచ్చలు ఏర్పడతాయి. కణుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం, వెన్నుపై ఆశిస్తే గింజలు తాలుగా మారడం గమనించవచ్చు. మొక్కలపై తెగులు ఆశించినప్పుడు 1 గ్రా. కార్బండాజిమ్ లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ లేదా ట్రైసైక్లబోల్ 0.3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization