గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 27 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 43 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వరి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడమైంది. నివారణకు 2గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ క్లోరాంట్రినిల్ప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం చలి మంచు వాతావరణం కనుక అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులను గమనించినట్టయితే నివారణకు ఎకరానికి 0.6గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కెండుసార్లు పిచికారి చేయాలి. వరిలో మొవ్వ ఈగ గమనించినట్టయితే 1.6 మి.లీ మొనోక్రోటోఫోస్ లేదా 2 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పి మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తామర, తేనె మంచు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్, 2.5 మి.లీ వేపనూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో పిందె రాలుట నివారణకు 0.25 మి.లీ ఎన్ఏఏ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. మామిడిలో కాయ పరిమాణం పెరిగేందుకు 10 గ్రా. 13-0-45+1.25 గ్రా. బోరాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్టయితే నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో బూడిద తెగుళ్లు వ్యాప్తికి అనుకూలం. నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ డైనోకాప్ లేదా 1 మి.లీ అజాక్సిస్ట్రోబిన్ లేదా 0.4 గ్రా. మైక్లోబ్యుటానిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో తామర పురుగులు కూడా ఆశించేందుకు అనుకూలం. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization