గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 31 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే 4 రోజుల్లో ఆదిలాబాద్, కొమురమ్భీం,ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణ్నోగతలు 21 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు. కొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంటలు తవ్వుకోవాలి.
మామిడి: మామిడిలో కాయ పరిమాణం పెరిగేందుకు 10 గ్రా. 13-0-45+1.25 గ్రా. బోరాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్టయితే నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో బూడిద తెగుళ్లు వ్యాప్తికి అనుకూలం. నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ డైనోకాప్ లేదా 1 మి.లీ అజాక్సిస్ట్రోబిన్ లేదా 0.4 గ్రా. మైక్లోబ్యుటానిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కోళ్ల యాజమాన్యం: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి. కోళ్లు వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగార్స్ను అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి, స్ప్రింకర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినేందుకు మెత్తటి దాణాను పెట్టి, తాగేందుకు చల్లటి నీటిని అందుబాటులో పెట్టాలి.
సేకరణ : మోత్కూరు యాదయ్య
Authorization