వివిధ పంటల్లో నాణ్యమైన విత్తనాలను ఒకే ప్రదేశంలో రైతులు నేరుగా కొనుగోలు చేసుకోవడానికి వీలును కల్పించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న భారతీయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా మే 24 న విత్తన మేళా అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని యూనివర్సిటీ ఆడిటోరియ ఆవరణలో నిర్వహిస్తున్నాయి.
నాణ్యమైనవి అందించేందుకు
ఈవిత్తన మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడు వ్యవసాయ వాతావరణం మండలాలైన జగిత్యాల (ఎన్టిజడ్) వరంగల్ (సీటీజడ్), పాలెం (ఎస్టిజడ్)లో కూడా అదే రోజు విత్తన మేళా నిర్వహిస్తున్నారు. ఈ విత్తన మేళాలో రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు వాటి గుణగణాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా తెలుసుకోవడానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాల సంస్థలు దాదాపు 15 స్టాళ్లను ఏర్పాటు చేసి పోస్టర్లు విత్తన నమూనాలను ప్రదర్శిస్తారు.
అనువైనవి ఎంపిక చేసుకోవచ్చు
ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా, సూచనల మేరకు తమ ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ మేళాలలోనే ప్రతి స్టాల్లో వివిధ పంటల రకాల గురించి వివరాలు విత్తన లభ్యత, పరిశోధనలో కొత్తగా కనుగొన్న విషయాలను ప్రతి శాస్త్రవేత్తతో మాట్లాడి ఆ పరిజ్ఞానాన్ని విలైనంత త్వరగా రైతుల పొలాలకు తీసుకెళ్లాలని సూచించడం జరుగుతుంది. వివిధ పంటల విత్తనాలను రైతులు కొనుగోలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరిలో సన్నగింజలకు సంబంధించి నాలుగు రకాలు (ఆర్ఎస్ఆర్-1508), (డబ్ల్యుజీఎల్ 44. కృష్ణ, బీపీటీ 5204) దొడ్డు గింజలకు సంబంధించి మూడు రకాల (జెజీఎల్18047. కఎన్ఎం118, ఎంటీయు 1010) పునాది విత్తనం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. హైబ్రిడ్స్కు సంబంధించి మొక్కజొన్నలో డిహెచ్ఎం117. ఆముదంలో టిసిహెచ్111 విత్తనాలను అందుబాటులో పెడుతున్నారు. అపరాలలో పెసర్లు నాలుగు రకాలు (ఎమ్‌జిజి295.ఎమ్‌జిజి347.ఎమ్‌జిజి351,డబ్ల్యుజిజి42).మినుములో టియు31. కందిలో నాలుగు రకాలు(డబ్ల్యుఆర్జి65.టిఆర్జి176.టిడిఆర్జి4.
ఆశా), పాలమూరు జొన్న, పశుగ్రాస పంటల విత్తనలు అందుబాటులో పెడుతున్నారు. అంతే కాకుండా ఈ మేళాలో రైతులతో ముఖాముఖి చర్చ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. వి. ప్రవీణ్‌రావు అధ్యక్షత వహిస్తూ వ్యవసాయంలో నాణ్యమైన విత్తనం పాత్ర, విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేసిన కొత్త వంగడాలు రైతులు గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి స్వయం సమృద్ధిని ఎలా సాధించాలో సూచిస్తారు.
అమ్మకానికి ఉన్న విత్తన రకాలు
1. వరి తెలంగాణ సోన ఆర్ఎస్ఆర్15048, డబ్ల్యుజిఎల్44, కెఎన్ఎమ్118, జెజిఎల్18047(బతుకమ్మ), సుమతి, సుగంధ సాంబ, శోభిని, తెల్లహంస, బిపిపి 5204, ఎంటియు1010.
2. మొక్కజొన్న మొక్కజ్నొ డిహెచ్ఎం117, మొక్కజొన్న డిహెచ్ఎం121, కరీంనగర్ మక్క, కరీంనగర్ మెక్క1.
3. కంది టిఆర్జి 176, టిటిడిఆర్జి65, డబ్ల్యుఆర్జి 65-ఆశా.
4. జొన్న సిఎస్వి 31.
5. ఆముదం పిసిహెచ్111, పిసిఎస్262.
6.వేరుశనగ కె6, కె9.
7. పెసర డబ్ల్యుజిజి 42, ఎమ్‌జిజి295, ఎమ్‌జిజి 347.
8. మినుములు పియు 31.
Authorization