పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి, బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్, కీరా....ఎడాపెడా తురిమేయాలంటే గ్రేటర్ చాలా అవసరం. తురుము సరిగా రాకపోయినా... లేదంటే తుప్పు పట్టినా లేదా వస్తువు పాతబడినా ఏం చేస్తారు? మూలన పడేయడమో, పాత సామాన్లవారికి వేయడమే కాకుండా ఇలా వంటింటిని అందంగా తీర్చిదిద్దేయవచ్చు. - దానిలో పువ్వులను అమర్చి టేబుల్ మీద పెడితే అందమైన వేజ్‌గా సిద్ధం. - కరెంట్ పోయినప్పుడో, క్యాండిలైట్ డిన్నర్‌కో గాలికి కొవ్వొత్తులు ఆరిపోతుంటే ఇలా ఉపయోగించండి. - బాల్కనీలో విద్యుద్దీపాలను అందంగా అలంకరించడానికి ఇదో చక్కని మార్గం. - ఉడెన్ స్పూన్లు వేయడానికి హోల్డర్ లేకపోతేనేం గ్రేటర్ ఉందిగా! - బోసిపోయిన వాల్‌ను ముచ్చటైన ప్రేమ్‌తో అలంకరించాలంటే.. ప్లాట్ గ్రేటర్‌పై చిన్న పెయింట్ వేస్తే చాలు.