మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబి రంగు పురుగు, టమాటలో పిన్వాం వంటి పురుగులు పంటలలో విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. రైతులు ఇప్పటికే ఆయా పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి, అరికట్టడానికి లింగాకర్షక బుట్టలు వాడుతున్నారు. అయితే వీటిలో వాడే 'ల్యూర్' సామర్థ్యంతో 15 నుంచి 20 రోజుల కంటే ఎక్కువ అవి పని చేయవు. ఇలాంటి పరిస్థితుల్లో 'నానో త్రిడి ల్యూర్'లు సాధారణ ల్యూర్లతో పోలిస్తే మూడింతలు ఎక్కువ కాలం పని చేస్తాయి. దీంతో పురుగుల ఉధృతిని, నష్టాన్ని సమర్థవంతంగా అరికట్ట వచ్చు. ఆ టెక్నాలజీ వివరాలు తెలుసుకుందాం...
నానో త్రిడి ల్యూర్ పని చేసే విధానం
రసాయనం టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఈ మాత్రలలో రసాయనం పౌడర్ రూపంలో మూడు పొరలుగా ఉంటాయి. ఒక్కొక్క పొరపై ప్రత్యేక రక్షణ కవచం ఉంటుంది. ఈ రక్షక కవచం గాలితో చర్యలోకి వచ్చినప్పుడు ఆక్సీకరణ చెందుతుంది. అప్పటి వరకు ఆక్సీకరణ ఉండదు. మొదట ల్యూర్ మాత్రలను లింగాకర్షక బుట్టలో పెట్టినప్పుడు పౌచ్ నుంచి మూడు పొరలుగా పని చేయడం మొదలవుతుంది. మొదటి పొర కొంత కాలం పని చేసిన తర్వాతనే, రెండో పొర చివరి నుంచి పని చేస్తుంది. రెండో పొర పూర్తిగా అయిపోయిన తర్వాత మూడో పొర రక్షణ కవచం గాలితో చర్య చెంది, ఆక్సీకరణ చెందుతుంది. ఈ టెక్నాలజీలో ల్యూర్లోని ఫిర్మోన్ మూడు దశలలో విడుదలై, ఎక్కువ కాలం పురుగులను ఆకర్షిస్తుంది. ఈవిధంగా మిగతా సాధారణ ల్యూర్లలో కాకుండా ఈ నానో త్రిడి ల్యూర్ నుంచి ఫిరమోన్ ఏకకాలంలో విడుదల కాదు. బదులుగా ఒక పొర తర్వాత మరోపొర నుంచి విడుదలవుతూ ఎక్కువ కాలం సమర్థవంతంగా పని చేస్తుంది.
సాధారణ ల్యూర్ల పని విధానం
1.రబ్బర్ కార్క్ లేదా చెక్క ముక్క ద్రవ్య ఫార్ములేషన్ ముంచుతారు
2. కార్క్ లేదా చెక్కముక్కపై ఫిరమోన్ పదార్ధంపై నియంత్రణ ఉండదు.
3. దఫాలుగా ఫిరమోన్ విడుదల కాదు.
4. ఫిరమోన్ మొత్తం ల్యూర్ నుంచి ఒకే సారి విడుదలవుతుంది, ఒకేసారి మొదలవుతుంది.
5. సాధారణ ల్యూర్లు తయారు చేసేటప్పుడు మేలైన పద్దతులు చాలా అరుదుగా పాటిస్తారు.
నానోత్రిడి ల్యూరో పని విధానం
1. త్రిడి మాత్రలలో పొడి రూపంలో ల్యూర్ ఫిరమోన్ అమర్చచబడి ఉంటుంది. (భారతదేశంలోనే ఇది తొలిసారి) 2. ఔషద పరిశ్రమలో వాటినట్టు ముందుగా నిర్ణయించిన మోతాదులో ఫిరమోన్ను మూడు పొరలలో సమానంగా నింపి తయారు చేస్తారు.
3. ఫిరమోన్ మూడు పొరలలో రక్షించబడుతుంది. మూడు దశలలోనూ సమానంగా విడుదల అవుతంది.
4. ఫిరమోన్ మూడు దశల్లో విడుదలవుతూ, మూడింతలు సమర్ధవంతంగా పని చేస్తుంది.
5. ఔషద పరిశ్రమ మాదిరిగా అధిక ప్రమాణాలు కలిగిన తయారీ పద్దతులు పాటించి నానోత్రిడి ల్యూర్ తయారు చేస్తారు.
- వెలాది పురుషోత్తంరావు
సేంద్రియ నిపుణులు, రైతు
Authorization