అనారోగ్యం బారిన పడినప్పుడు ఆనందం ఆవిరైపోతుంది. బాధపడినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అలా ఉండటానికి మాత్రం ఎవరూ ప్రయత్నించరు. సంతోషమే సగం బలమని గ్రహిస్తే ఎంతటి అనారోగ్య సమస్యైనా మిమ్మల్ని ఏమీ చేయదు.
- చిన్నచిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా.. ఏదో అయిపోయిందని తెగ హైరానా పడిపోతుంటారు కొందరు. ఇలా టెన్షన్ పడటం వల్ల వ్యాధి తగ్గకపోగా.. బీపీ లెవల్స్‌లో తేడాలు వస్తుంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది.
- మన ఆలోచనలు మెదడును చాలా ప్రభావితం చేస్తాయి. ఏమవు తుందోనని బాధపడటం మొదలు పెట్టారా? ఆ క్షణం నుంచి మీ మెదడు నుంచి నెగెటివ్ సంకేతాలే వెలువడుతుంటాయి. వాటిని అనుసరిస్తూనే శరీరంలోని ఆర్గాన్స్ ప్రతికూలంగా పని చేసే ప్రమాదమూ ఉంది.
- కొందరు అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో నానాయాగీ చేస్తుంటారు. మంచానికే పరిమితం కావడంతో ఇంట్లో వాళ్లపై అరుస్తుంటారు. తనను పట్టించుకోవడం లేదన్న ఆత్మనూన్యతా భావం వారిలో పెరిగిపోతుంటుంది. ఇలాంటి వారు మంచి చెప్పినా అంత తొందరగా అర్థం చేసుకోలేరు. కానీ, వారు ఏం చెప్పినా మీ మంచి కోసమే అని గ్రహించండి. సావధానంగా ఆలోచించి స్థిమితపడండి.
- వ్యాధిని తగ్గించడంలో వైద్యం పాత్ర ఎంతుందో.. మానసిక బలం కూడా అంతే కీలకం. రుగ్మతలను ఎదుర్కోవ డానికి మీరు మానసికంగా సిద్ధంగా లేకపోతే.. మందులు కూడా సరిగ్గా పనిచేయవు. అందు కని.. డాక్టర్ సలహాలు పాటిస్తూనే, 'నాకు తగ్గిపో తుంది' అన్న విశ్వాసం పెంచుకోండి. సంతో షంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉదయాన్నే అలా బయటకు వెళ్లిరండి. నలుగురి తో కులా సాగా కబుర్లు చెప్పండి. పుస్తకాలు చదవండి. శ్రావ్యమైన సంగీతం వినండి. ఇవన్నీ మీకు తెలియకుండానే మీపై మీకు నమ్మకాన్ని పెంచు తాయి. ఆ కాసేపైనా మీరు వ్యాధిగ్రస్తులన్న ఆలోచన మీ నుంచి దూరం అవుతుంది. ఈ పద్ధతులను పాటిస్తే మీరు ఆరోగ్యవంతులు అవ్వడానికి ఎంతో కాలం పట్టదు.
Authorization