ఆముదం వర్షాధారంగా మెట్టప్రాంతాలలో పండించే నూనెగింజల పంటలలో ముఖ్యమైనది.ఆముదం పంటను అన్ని రకాల నేలలో అంటే ఎర్రనేలలు, మధ్యస్థపు నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. కానీ చౌడు, నీరు నిల్వ ఉండే నేలల్లో సాగు చేయకూడదు. సాధారణంగా వర్షాలు ఆలస్యం అయినప్పుడు ఆగస్టు 20 వరకు కూడా ఈ పంటను వేసుకోవచ్చు.
ఎర్రచెల్క నేలల్లో బెట్టను తట్టుకునే సూటిరకాలైన హరిత, క్రాంతి, కిరణ్, జ్వాల, పిసిఎస్ -262లను ఎంపిక చేసుకోవాలి. నల్లరేగడి భూముల్లో, నీటిపారుదల సౌకర్యం ఉన్న నేలల్లో పిసిహెచ్-111, 222, డిసిహెచ్-519,177 వంటివి అధిక దిగుబడినిస్తాయి. తేమను తక్కువగా నిలుపుకునే ఎర్రచెల్కా నేలలో 60 ×45 సె.మీ విత్తే దూరాన్ని పాటించాలి. ఆలస్యంగా విత్తుకుంటే
60 ×30సెం.మి విత్తే దూరం కుదించాలి. ఎకరానికి కనీసం 7400 నుండి 15వేల మొక్కల సాంద్రత ఉండేటట్లు చూసుకోవాలి. నల్లరేగడి నేలల్లో నీటిపారుదల కింద సాగు చేసేటప్పుడు 90ఇంటు 60 సెం.మీ విత్తే దూరం పాటించాలి. ఎకరానికి 26కిలలో డిఏపి, 16 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్, ఎరువులను దుక్కిలో వేయాలి.మిగిలిన నత్రజని మోతాదును రెండు దఫాలుగా చేసి విత్తన 30 నుంచి 60 రోజులకు ప్రతిసారి 15కిలోల యూరియా వేస్తుండాలి.
నువ్వులు
ఏ పంట విత్తుకోలేని పరిస్థితుల్లో కొద్దిపాటి నీటి పారుదల సౌకర్యం ఉన్నా నువ్వులు ఒక మంచి ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు రెండో వారంలో వేసుకోవచ్చు. శ్వేతతిల్ లేదా శారద అనే రకాలు అనువైనవి. ఎకరానికి 2.5కిలోల విత్తనం అవసరం ఉంటుంది. రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు కిలో విత్తనానికి 2.5 మి.లీ.ఇమిడాక్లోప్రిడ్తో విత్తనం శుద్ధి చేసుకోవాలి. జల్లే పద్ధతి కన్నా వరుసల పద్దతిలో విత్తుకోవడం వల్ల అంతరకృషి, ఇతర యాజమాన్య పద్దతులు సులభంగా చేపట్టవచ్చు. వరుసల మధ్య 30.సె.మీ, మొక్కల మధ్య 15.సెం.మీ దూరం ఉండే విధంగా చూసుకోవాలి. విత్తే ముందు దుక్కిలో ఎకరానికి 18 కిలోల యూరియా, 50కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 10కిలోల మ్యూరరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
Authorization