- వివిధ పంపులకు సూచించిన మోతాదులోనే మందు ద్రావణాన్ని వాడాలి
- పంపును మందు ద్రావణంతో ఎప్పుడూ నింపరాదు
- విధిగా పంపుకు కేటాయించిన జాలీ ద్వారానే మందు ద్రావణాన్ని పోయాలి
- స్ప్రేయర్‌ను వాడే ముందు వివిధ భాగాలను మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా హాస్పైపు, లాన్స్ ద్వారా నీరు బయటకు పడేవిధంగా సరిచేసుకోవాలి
- నాజిల్ నుండి నీరు ధారలా కాకుండా పొగమంచులా, చిన్న తుంపర్లలా పడే విధంగా చూసుకోవాలి.
- పవర్పంపు వాడినప్పుడు సూచించిన మేరకు నక్షత్రపు (ఎర్రమార్కు) మార్కు వద్ద ఉంచాలి.
- ఎట్టి పరిస్థితుల్లో సూదితోగానీ, దబ్బనంతోగానీ రంద్రం చేయాలి.
- పైరులో ఆశించిన పురుగు, తెగుళ్లను బట్టి స్ప్రేయర్‌తో పిచికారిలో చిన్న మార్పులు చేసుకోవాలి.
- వరిలో సుడిదోమ,పొడ తెగులు వంటివి ఆశించినప్పుడు మొక్కల మొదళ్లపై పడే విధంగా పిచికారి చేయాలి.
- అవసరమైతే పాయలు తీసి పిచికారి చేయాలి.
- మిరపలో నల్లి నివారణకు ఆకుల కింద భాగం తడిచేలా చూడాలి.
- పవర్ స్ప్రేయర్ వాడే ముందు తగిన సార్ద్యంతో పని చేయాలంటే ఇంజన్ ఆయిల్ సరి చూసుకోవాలి.
- కలుపు మందులు వాడేటప్పుడు విధిగా ఫ్లడ్జెట్నాజిల్ గానీ ఫ్లాట్పాన్ నాజిల్గానీ వాడాలి.
- పిచికారి అనంతరం స్ప్రేయర్లు వాటి విడి భాగాలు ముఖ్యంగా నాజిల్, తుప్పుపట్టకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
Authorization