గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
కోసిన ధాన్యం మార్కెట్కు తరలించకుండా వాయిదా వేసుకోవాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా చూసుకోవాలి. ఈ వర్షాలను ఉపయోగించుకుని వేసవి దుక్కులు చేసుకోవాలి. దీని వల్ల నేలలోని చీడపీడలు, వాటి కోశస్థ దశలు కలుపు విత్తనాలు నశించిపోతాయి. వర్షాల వల్ల వర్షాధార పంటల్లో నిలిచిన నీటిని తీసివేయాలి. రాబోవు ఐదు రోజుల్లో వర్షపాత సూచనలున్నందున వర్షాలు కురిసిన తర్వాత వర్షాధార పంటలలో పైపాటు ఎరువులను వేసుకోవాలి.
వరి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో సుడిదోమ ఉదృతి పెరిగే సూచనలున్నాయి. దోమ ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5గ్రా. లేదా బుఫ్రోఫెజిన్ 1.6 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్న: మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టు గుర్తించారు. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లం కలిపి 2 నుంచి 3 లీ. నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రా. థైడికార్బ్ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండులుగా చేసి మొక్క సుడులలలో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాన్ప్రోనిలిప్రోల్ 0.4 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
సోయాచిక్కుడు: సోయాచిక్కుడులో పొగాకు లద్దె పురుగు గమనించిడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోర్పైరిఫాస్ లేదీ 1 మి.లీ నోవల్యురాన్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా ఎసిఫేట్ లీటరు నీటినికి కలిపి పిచికారి చేయాలి. వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు గమనించడమైంది. నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. 2 మి.లీ ప్రొఫినోపాస్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
- మోత్కూరు యాదయ్య
Authorization