ప్రశ్న: నేను ఎస్ఎ మ్యాథ్స్‌గా రూ.35,120 మూల వేతనంతో పని చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికై ఏదైనా శాఖలో ఇంతకంటే తక్కువ స్కేలుగల పోస్టులో చేరితే పే- ప్రొటెక్షన్ ఉంటుందా?
- జి.శ్రీనివాసులు, సూర్యాపేట
జవాబు: పే ప్రొటెక్షన్ ఉంటుంది. జీవో ఎంఎస్ నెం:45, తేదీ: 19.02.2014 (అ. దర్శిని 31 పేజీ 3) ప్రకారం తేదీ: 31.12.2013కు ముందు నియామకం అయిన వారికి పే ప్రొటెక్షన్ ఇవ్వబడింది. మీరు నియామకపు అధికారితో అనుమతి పొంది పరీక్ష రాసి, ఎంపికైన తర్వాత విడుదల అయిన సంర్భంలో ప్రభుత్వ అనుమతితో పే- ప్రొటెక్షన్ పొందే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: రెండు రోజులు మెడికల్ లీవ్ కావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ప్రభుత్వ డాక్టర్ నుండి తీసుకోవాలా? ప్రైవేట్ ఎంబిబిఎస్ డాక్టరు నుంచి సరిపోతుందా?
- శ్రీనివాస్, రామాయంపేట, మెదక్‌జిల్లా
జవాబు: ప్రైవేట్ ఎంబీబీఎస్ డాక్టరు అయినా సరిపోతుంది. సెలవు నిబంధనలు - 1933లోని రూల్ 71 ప్రకారం నాన్ గెజిటెడ్ ఉగ్యోగులకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్, బీఎఎంఎస్ మొదలైనవారు) ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ సరిపోతుంది.
ప్రశ్న: హై స్కూల్లో పని చేసే నాన్ టీచింగ్ స్టాఫ్ టైమింగ్స్ విడిగా ఉంటాయా? లేక పాఠశాల టైంనే పాటించాలా?
- యం.వెంకటేశ్వర్లు, పాల్వంచ
జవాబు: పాఠశాల సమయాన్నే పాటించాలి. పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ వెకేషన్ డిపార్ట్మెంట్గానే పరిగణించబడుతారు. కావున ఒకే టైమ్‌టేబుల్‌ను పాటించాలి.
ప్రశ్న: ఒక ఉపాధ్యాయురాలు జూలై 1 నుంచి 23 వరకు అనారోగ్యం కారణాలతోఅర్ధవేతన సెలవులో వెళ్లి జూలై 24న పాఠశాలకు హాజరయ్యారు. జూలై 23 ఆదివారం, మెడికల్ సర్టిఫికేట్ 22 వరకు తీసుకోవాలా? 23 తీసుకోవాలా? ఆదివారం కూడా హెచ్ఎల్గానే పరిగణిస్తారా?
- కె.కృష్ణా, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా
జవాబు: మెడికల్ సర్టిఫికేట్ జూలై 22 వరకే తీసుకోవాలి. ఎఫ్ఆర్.68లోని ఎస్ఆర్-1 ప్రకారం ఆకస్మికేతర సెలవునకు ముందు, వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ సెలవు దినాలు ప్రిఫిక్స్, సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడుతుంది.
ప్రశ్న: ప్రభుత్వ ఉద్యోగి ఫెస్టివల్ అడ్వాన్స్ పొందడానికి మూలవేతనం ఎంతలోపు ఉండాలి?
- జి.విశాల్, ఎర్థండి, జగిత్యాల జిల్లా.
జవాబు: జీవో నెం.39, ఆర్థిక తేదీ:15.4.2015 ప్రకారం ఆర్పిఎస్-2015 వేతన స్కేళ్లలో 26,600-77030లోపు వేతన స్కేలు కలిగిన ఉద్యోగులకు రూ.7500, 4వ తరగతి ఉద్యోగులకు స్కేలుతో నిమిత్తం లేకుండా రూ.5000 పండుగ అడ్వాన్స్ పొందడానికి అర్హత ఉంటుంది.
- టి. లక్ష్మారెడ్డి, రాష్ట్రకార్యదర్శి, టీఎస్‌యుటీఎఫ్
Authorization