ప్రశ్న: ఒక ఎస్జీటీ 18 సంవత్సరాల స్కేలు తీసుకున్న అనంతరం ఎస్ఎ ప్రమోషన్ పొందితే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఎన్ని వస్తాయి. - పి.చక్రధరరావు.
జవాబు: ఎస్జీటీ 18 సంవత్సరాల స్కేలు తీసుకున్నప్పటికీ, ఎస్ఎగా పదోన్నతి పొందినట్లయితే ఎఫ్ఆర్ 22 (బి) ప్రకారం వేతనం నిర్ణయించబడుతుంది. కనుక 2 ఇంక్రిమెంట్లు వస్తాయి.
ప్రశ్న: దసరా సెలవులకు ముందు, వెనుక పనిదినాలు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలా? అత్యవసర సందర్భాలలో ఏ సెలవు వినియోగించుకోవాలి?
- వై.రవికుమార్
జవాబు: దసరా సెలవులు 14 రోజుల మించి ఉన్న సందర్భంలో డైరెక్టర్ ఉత్తర్వులు, ఆర్సి నెం: 815/ ఇ1/1999 తేదీ: 01.09.1999 ప్రకరాం దసరా సెలవులకు ముందు, వెనుక పని దినాలలో పాఠశాలలకు ఏదో ఒక రోజు హాజరైనా సరిపోతుంది. హాజరుకాని రోజులకు అర్హత గల ఆకస్మికేతర సెలవును ఏదైనా వినియోగించుకోవచ్చును.
ప్రశ్న: సంవత్సరం మధ్యలో రిటైరయ్యే ఉపాధ్యాయులు సిఎల్స్, ఎస్సిఎల్స్ పూర్తిగా వినియోగించుకోవచ్చా? లేక సర్వీసు దామాషాలో వినియోగించుకోవాలా?
- ఎం.నరసింహారావు, చింతగూడెం, ఖమ్మం
జవాబు: ఎఫ్ఆర్లోని అనెగ్జర్ (7) ప్రకారం తాత్కాలిక పద్ధతిలో నియామకమైన ఉద్యోగులకు మాత్రమే సర్వీసు దామాషాలో సిఎల్స్, ఎస్సిఎల్స్ మంజూరు చేయబడతాయి. సంవత్సరం మధ్యలో రిటైరయ్యే శాశ్వత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సిఎల్స్, ఎస్సిఎల్స్ పూర్తిగా వినియోగించుకోకూడదనే నిబంధనేమీ లేదు.
ప్రశ్న: నేను బిఎస్సి,బిఇడితో 2008 డిఎస్సిలో ఎస్జీటీగా ఎంపికయ్యాను. ఎస్ఎ (పిఇ) ప్రమోషన్ అర్హతలైన బిపీఇడీకి ఇన్ సర్వీస్‌లో ఆన్‌డ్యూటీపై వెళ్లడానికి అవకాశం ఉందా?
- ఎన్. రాజశేఖర్, జోగులాంబ గద్వాల జిల్లా
జవాబు: బిఎస్ఇ ఉత్తర్వులు ఆర్షి నెం: 3596/ సర్వీస్-4-3/2016, తేదీ: 27.01.2016 ప్రకారం తదుపరి ప్రమోషన్ పోస్టుకు అర్హతలు గల సందర్భంలో ఇన్‌సర్వీసులో మరొక కోర్సుకు ఆన్‌డ్యూటీపై వెళ్లడానికి అవకాశం లేదు.
ప్రశ్న: మండల విద్యాధికారి (ఎంఇఓ) ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంలో హెచ్ఎం సీటులో కూర్చోవచ్చా? హెచ్ఎం, ఎంఇఓ హోదాలు సమానమే కదా?
- వెంకటస్వామి, మంగపేట, జె.ఎస్.భూపాలపల్లి జిల్లా
జవాబు: కూర్చోకూడదు. హెడ్ మాస్టరు, మండల విద్యాధికారి ఇద్దరు సమాన హోదా కల్గిన వారు కాబట్టి ఉన్నత పాఠశాలను ఎంఇఓ సందర్శించినప్పుడు హెచ్ఎం సీటులో కూర్చోరాదు.
ప్రశ్న: నేను 2017 జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు ఓసిఎల్లో ఉన్నాను. ఆగస్టు 6,7 తేదీలు ప్రభుత్వ సెలవులు, ఆగస్టు 8న పాఠశాల విధులలో చేరాను. అర్ధవేతన సెలవు మంజూరు కోరగా జూలై 29 ఆగస్టు 7 వరకు హెచ్పిఎల్గా పరిగణిస్తామంటున్నారు. సమంజసమా?
- కవితాదేవి, బి.రామారం, యాదాద్రి భువనగిరి జిల్లా
జవాబు: సమంజసం కాదు. ఎఫ్ఆర్ 68లోని ఎన్ఆర్-ఎ ప్రకారం ఆకస్మికేతర సెలవులకు ముందు, వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ సెలవు దినాలు ప్రిఫిక్, సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడుతుంది. జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు మాత్రమే అర్ధవేతన సెలవు మంజూరు చేసి, ఆగస్టు 6,7 తేదీలను సఫిక్స్ చేసి పూర్తి వేతనం చెల్లించాలి.
ప్రశ్న: ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు 1998 డిసెంబర్లో ఎస్ఎ ప్రమోషన్ పొందాడు. కానీ అతనికి జూన్ 1999లో 16 సంవత్సరాలు సర్వీసు పూర్తయిందని ఎస్జీటీ క్యాడర్లో 16 సంవత్సరాల స్కేలు తీసుకున్నాడు. సమంజసమేనా?
- సిహెచ్ యాదగిరి, యద్దూరు, సిద్ధిపేట జిల్లా
జవాబు: సమంజసం కాదు. ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటుగా పదోన్నతి పొందిన కారణంగా 16 సంవత్సరాల సర్వీసు పూర్తి కాకుండానే కేడర్ మారింనందున, పూర్వపు ఎస్జీటీ కేడర్‌లో 16 సంవత్సరాల స్కేలు పొందడానికి వీలు కాదు.
ప్రశ్న: సిపిఎస్ మిస్సింగ్ క్రెడిట్స్‌ను ఎలా అప్డేట్ చేసుకోవాలి? అప్డేట్ చేయాల్సిన బాధ్యత డీడీఓదా, ఎస్టీఓదా? మిస్సింగ్ క్రెడిట్ ్స వడ్డీ వస్తుందా లేదా జమ అయిన తేదీ నుండే వస్తుందా?
- కె.ఉప్పలయ్య, తిరుమలయపాలెం, ఖమ్మం
జవాబు: జీవో ఎంఎస్. నెం: 250, ఆర్థిక తేదీ: 06/09/2012 ప్రకారం సీపీఎస్ లావాదేవీల నిర్వహణ బాధ్యత ట్రైజరీ అధికారులది. డ్రాయింగ్ అధికాలులు మినహాయించిన సొమ్ము ప్రతినెలా 10వ తేదీలోపు సీపీఎస్ ఖాతాలలో జమ అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత ట్రెజరీ అధికారులదే. సీసీఎస్ ఖాతాపై ప్రత్యేకంగా వడ్డీ ఏమీ రాదు. కానీ షేర్ మార్కెట్ (మ్యూచవల్ ఫండ్స్)లో పెట్టుబడి పెడుతారు కాబట్టి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యే తేదీ నుండి నెట్ అసెట్ విలువ వస్తుంది.
ప్రశ్న: 50 సంవత్సరాల వయసు దాటిన ఎస్ఎ ఉపాధ్యాయుడు, డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాకుండానే 12 సంవత్సరాల ఎఎఎస్ స్కేలు పొందుటకు అర్హుడేనా? సంబంధిత జీవో వివరాలను తెలపండి?
- పి.రవీందర్, రాజన్న సిరిసిల్ల
జవాబు: అర్హుడే, ఆర్పిఎస్. 2015 నందు ఎఎఎస్కు వర్తిస్తాయని సర్వీస్ రూల్స్ 9, 10ల ప్రకారం వర్తిస్తాయని పేర్కొనడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయుడు డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ కాకుండానే పదోన్నతికి అనుమతిస్తున్నారు కనుక ఎఎఎస్కు కూడా అనుమతించాలి.
Authorization