ప్రశ్న: ప్రసూతి సెలవును ఎప్పటి నుంచి మంజూరు చేయాలి. కొందరు డీడీఓలు డెలివరీ తేదీ నుండి మాత్రమే వినియోగించుకోవాలంటున్నారు. సమంజసమా?
- కె.దేవరాజ్, తుంగతుర్తి
జవాబు: ప్రసూతి సెలవులను ఎప్పటి నుండి మంజూరు చేయాలనే విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులలో ఎలాంటి నిర్దిష్టమైన సూచనలు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రసూతి సెలవుల చట్టంలో డెలివరీ తేదీకీ 6 వారాల ముందు నుండే ప్రసూతి సెలవును వినియోగించుకునే అవకాశం కల్పించబడింది. (మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ చట్టం ఆధారంగా వివరణ ఉత్తర్వులు ఇవ్వాలని 2015, సెప్టెంబర్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం చేసింది. ఆర్థిక శాఖ వారు అంగీకరించి అనుమతి కోసం 18 నెలల కిందట దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆ దస్త్రం తిరిగిరాలేదు.)
ప్రశ్న: నేను ఎస్‌ఏగా పనిచేయుచున్నాను. నా మూల వేతనం 36,070 రూపాయలుగా ఉన్నది. ప్రస్తుతం టీఎస్జీఎలఐలో నెలవారీ 1150 రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాను. దీనిని 5 వేల రూపాయలకు పెంచుకోవచ్చా? - బి.శేఖర్, వాజేడ్
జవాబు: పెంచుకోవచ్చు. మూల వేతనమును బట్టి ప్రీమియంను చెల్లించాలి. మీరు ప్రస్తుత మూల వేతనం ప్రకారం 1150 రూపాయలు మినిమమ్ చెల్లిస్తున్నారు. గరిష్టంగా మూలవేతనానికి 20 శాతం వరకు పెంచుకోవచ్చు. జీవో నెం: 124, ఆర్థిక తేదీ: 24.05. 2013 ప్రకారం నిర్దారిత శ్లాబ్‌రేటు కన్నా ఎక్కువ ప్రీమియం చెల్లించాలనుకుంటే ప్రీమియం మినహాయించిన వెంటనే టీఎస్జీ ఎల్ఐ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుకోవాలి.
ప్రశ్న: ఒక ఉపాధ్యాయుడు ఇరవై రోజుల అర్ధవేతన సెలవు వినియోగించుకున్న అనంతరం, 2 రోజుల ప్రభుత్వ సెలవుల తర్వాత విధులలో చేరాడు. అతనికి 20 రోజుల సెలవు మంజూరు చేయాలా? ప్రభుత్వ సెలవు దినాలతో కలిసి 22 రోజుల సెలవు మంజూరు చేయాలా? తెలుపగలరు? - రవీందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా
జవాబు: ఎఫ్ఆర్. 68లోని ఎస్ఆర్(1) ప్రకారం, ప్రభుత్వ మెమో నెం: 86595/1210/ఎఫ్ఆర్ 1/7, తేదీ: 25.05.1981 ఉత్తర్వుల ఆధారంగా ఆకస్మికేతర సెలవులనకు ముందు, వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ సెలవు దినాలు ఫ్రిఫిక్స్, సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం పై ఉపాధ్యాయుడికి 20 రోజుల అర్ధవేతనం సెలవు మంజూరు చేసి, 2 రోజుల ప్రభుత్వ సెలవులను సఫిక్స్ చేసి పూర్తి వేతనం చెల్లిస్తారు. ఇటీవల ఆర్థికశాఖ ఒక ఉద్యోగికి ప్రిఫిక్స్, సఫిక్స్లతో మంజూరు చేసిన ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెం: 1218, ఆర్థిక తేదీ: 06.12.2014, అ.ద.32ను పరిశీలించండి)
Authorization