ప్రశ్న: నేను 2002 జనవరి 18న ఉద్యోగంలో ఎస్జీటీగా చేరాను. నేను అంతర్జిల్లా బదిలీల్లో 2009లో మారిన నేపథ్యంలో ఆ జిల్లా 2002 డీఎస్సీ ఉపాధ్యాయులతో అక్టోబర్ నెలకు ప్రీపొన్మెంట్ చేసుకునే అవకాశం ఉందా? నాకు ప్రీపొన్మెంట్ వర్తిస్తుందా? వివరణ ఇవ్వగలరు?
- డి.శ్రీనివాస్, నల్లగొండ
జవాబు: వీలుకాదు, మీరు అంతర్జిల్లా బదిలీల్లో 2009 వేరే జిల్లాకు అయిన నేపథ్యంలో స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్ 35(బి) ప్రకారం ఆ జిల్లాకు వచ్చిన తేదీ నుండే సర్వీస్ పరిగణనలోకి వస్తుంది. కావున ఆ జిల్లా 2002 డిఎస్సీ ఉపాధ్యాయుల కంటే మీరు జూనియర్ అవుతారు. కాబట్టి వారితో ప్రీపొన్మెంట్ అవకాశం లేదు.
పశ్న: సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగి మరణిస్తే, అతని కుటుంబానికి డెబ్ బెనిఫిట్స్, కారుణ్య నియామకం వర్తిస్తాయా?
- ఎం.మొయిజ్ఖాన్, రంగారెడ్డి జిల్లా
జవాబు: వర్తిస్తాయి. ఉద్యోగి మరణించే నాటికి సప్పెన్షన్తో ఉన్నా అతని కుటుంబానికి డెత్ బెనిఫిట్స్, కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ప్రభుత్వ ఉత్తర్వులు మెమో నెం: 618 (సర్వీస్ ఎ/ 78-11), తేదీ: 17.12.1999, ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ 50 ప్రకారం వర్తిస్తాయి.
Authorization