- అలవెన్స్ రాదని అంటున్నారు. వాస్తవమేనా?
ప్రశ్న: నేను 65 రోజుల అర్ధ జీతపు సెలవు పెట్టాను. కానీ నాకు తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఆఫ్ పే చేశారు. సమంజసమేనా? - బి.సాయిలు, సంగారెడ్డి
జవాబు: సమంజసమే. R.C.NO.3572/107/A/ Admn.I /2014 తేదీ: 15.12.2014 ప్రకారం తెలం గాణ ఇంక్రిమెంట్‌ను కూడా కుటుంబ నియం త్రణ ఇంక్రి మెంట్లాగానే చూడాలని స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. కావున తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కూడా ఆఫ్ పే నే చేస్తారు.
ప్రశ్న: ఒక మహిళా ఉపాధ్యాయిని ఒకే క్యాలెండర్ సంవత్స రంలో 20 ఆకస్మిక సెలవులు, 7 ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు 7 CCLS కూడా వినియోగించు కోవచ్చా?CLS&CCLS కలిపి 30 దాటవచ్చా?
- మీసాల మల్లికార్జున్, సిరిసిల్ల
జవాబు: వినియోగించుకోవచ్చును. CL’S `15 మహిళలైతే 20,20, Spl-7,CCLs `10 వరకు గరిష్టంగా క్యాలెండర్ ఇయర్లో వాడుకొనవచ్చును.
ప్రశ్న: నేను FAC HM గా 01.10.2016 నుండి విధులు నిర్వహిస్తున్నాను. 2017 మార్చిలో మొదటి 3 నెలలకు HM అలవెన్స్ తీసుకున్నాను. నాకు తదుపరి కాలానికి అలవెన్స్ రాదని అంటున్నారు. వాస్తవమేనా? వివరణ ఇవ్వగలరు? - చెంచయ్య, ఏటూరు నాగారం
జవాబు: వాస్తవం కాదు. తదుపరి కాలానికి కూడా వస్తుంది. FR 49 ప్రకారము మొదటి 3 నెలలకు అలవెన్స్‌ను ఇస్తారు. ఆ తదుపరి 3 నెలల వరకు G.O.MS,NO 282 ఆర్థిక శాఖ మరియు ప్రణాళిక శాఖ (FW.FRS) డిపార్ట్మెంట్ తేదీ.11.08.1977 ప్రకారము ప్రభుత్వ అనుమతితో అలవెన్సును ఇస్తారు.
టి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి,
టీఎస్‌యుటీఎఫ్
Authorization