Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం అందరి జీవితాలు బిజీబిజీగా.. గజిబిజిగా గడుస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న చిన్న అంశాలు సైతం మనకు పెద్దవిగా కనిపిస్తున్నాయి. కోపం కలిగిస్తున్నాయి. వెరసి జీవితంలో సానుకూల దక్పథాన్ని.. మరచి ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా చూడటం అలవాటు చేసుకొన్నాం. ఎంతలా అంటే.. ఎవరైనా చిన్న మాట అన్నా సరే.. తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. మరి మన జీవితంలోకి మళ్లీ పాజిటివిటీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?
ఇల్లు శుభ్రంగా : రోజంతా ఆఫీసులో పనిచేసి వచ్చిన తర్వాత ఇంటిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ తలుపు తీయగానే ఎక్కడికక్కడ చెత్త కనబడితే మళ్లీ నీరసం వచ్చేస్తుంది. దాంతో పాటే కోపం కూడా వస్తుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పరిశుభ్రమైన ఇంటి వాతావరణం మనసుకి ప్రశాంతతను అందిస్తుంది. ఆఫీసుకి వెళ్లే హడావుడిలో చాలామంది మాసిన బట్టలను పక్కన పడేయడం, బెడ్ సర్దకపోవడం, ఉతికిన బట్టలను మడతపెట్టకపోవడం చేస్తుంటారు. వాటిని ఏ కుర్చీ లేదా మంచం మీద వేసి.. తర్వాత మడత పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఆఫీసుకి వెళిపోతుంటారు. తీరా వచ్చిన తర్వాత మళ్లీ ఇంటి పని, వంట పని పూర్తి చేసేసరికి ఉన్న ఓపిక కాస్తా అయిపోతుంది. దీంతో ఎక్కడి బట్టలు అక్కడే ఉంటాయి. అందుకే రెండు లాండ్రీ బాస్కెట్స్ కొనండి. ఒకదానిలో మాసిన దుస్తులు, మరొక దానిలో ఉతికిన దుస్తులు వేయండి. ఇలాంటి బాస్కెట్స్ ప్రతి రూమ్‌లోనూ పెట్టండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో వాటిని మడత పెట్టండి. ఇల్లు నీట్‌గా ఉండటంతో పాటు పని చేశామనే శ్రమ కూడా అనిపించదు. అలాగే డైనింగ్ టేబుల్ మీద సైతం అవసరమైనవి మాత్రమే ఉంచండి. మిగిలినవాటిని టేబుల్ పై ఉంచొద్దు. ఇదే సూత్రం డ్రెస్సింగ్ టేబుల్‌కి కూడా వర్తిస్తుంది.
ఇండోర్ ప్లాంట్స్ : ఇంట్లో మనం పెంచుకొనే అలంకరణ మొక్కలు గాలిని శుద్ధి చేయడం మాత్రమే కాదు.. ఒత్తిడిని సైతం తగ్గిస్తాయి. అలాగే నిద్ర బాగా పట్టేందుకు సహకరిస్తాయి. ఈ రెండింటి వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి ఇంట్లో మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. అలంకరణ మొక్కలు మాత్రమే కాకుండా ప్రకాశవంతమైన రంగుల్లో పూలు పూచే ఇండోర్ ప్లాంట్స్ సైతం ఎంచుకోండి. ఇవి మీ ఇంటిని అందంగా మార్చడమే కాదు.. మిమ్మల్ని ఉత్సాహంగా మార్చేస్తాయి. మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటికి హాని కలిగించని మొక్కలను ఎంచుకోండి.
స్ఫూర్తిని కలిగించే డెకరేషన్ : ఇంటిని అందంగా ఉంచడంతో పాటు మీలో కాస్త స్ఫూర్తిని కలిగించే విధంగా.. కొన్ని డెకరేటివ్ పీసెస్‌ను ఎంచుకోండి. వాటితో ఇంటిని అలకరించండి. వాటిపై మిమ్మల్ని ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంచే వాక్యాలు ప్రచురించండి. వాటిని మీరు చూసినప్పుడల్లా మీలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది.