Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమ స్యల్లో బరువు పెరిగిపోవడం ఒకటి. దీనికి ఎన్నోరకాల కార ణాలు ఉండొచ్చు. అయితే అన్నింటికంటే ప్రధాన కార ణం మాత్రం హార్మోన్ల అసమ తుల్యత. సాధారణంగా ఇబ్బంది ఎదురవనంత కాలం చాలామంది ఈ సమస్యను పెద్దగా పట్టిం చుకోరు. కానీ ఓసారి ఇబ్బంది ఎదురయ్యాక దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడా నికి చాలా సమయమే పడుతుంది. అందుకే సమస్య మొదట్లో ఉన్నప్పుడే దాన్ని తగ్గించుకోవడం మంచిది.
వాటి వల్లే బరువు పెరుగుతాం : హార్మోన్ల అసమతుల్యత బరువు పెరిగేలా చేయడం మాత్రమే కాదు.. తిరిగి తగ్గడాన్ని చాలా కష్టతరంగా మారుస్తుంది. అయితే ఇదంతా కేవలం రెండు రకాల హార్మోన్ల వల్లే ఎదురవుతుంది. మన శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలవు తాయన్న సంగతి మనలో చాలామందికి తెలిసిందే. మన రుతుక్రమం సరిగ్గా కొనసాగేందుకు ఇవి తోడ్పడతాయి. అయితే ఈ రెండు హార్మోన్లు సరైన మోతాదులో విడుదలవ్వాల్సి ఉంటుంది. రెండిట్లో ఏ ఒకటి ఎక్కువగా విడుదలైనా ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణంగా చాలామందిలో ప్రొజెస్టిరాన్ తక్కువగా విడుదలవుతూ ఈస్ట్రోజన్ స్థాయులు పెరుగుతుంటాయి. దీనివల్ల బరువు అపరిమితంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు జుట్టు రాలిపోవడం, రుతుచక్రం క్రమం తప్పడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది : ఈస్ట్రోజన్ ఎక్కువవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాదు.. చాలా సమస్యలే ఎదురవుతాయి. అందులో ముఖ్యమైనవి డిప్రెషన్, ఎక్కువగా ఆందోళన చెందడం, నిద్రలేమి వంటివి. ఈ సమస్యలు మనలో ఒత్తిడిని పెంచి ఎక్కువగా తినాలనే కోరికను పెంచుతాయి. దీంతో పాటు ఈస్ట్రోజన్ మనం తినే ఆహారంలో ఎక్కువ భాగాన్ని శరీరంపై కొవ్వు లేయర్‌గా పరుచుకునేలా చేస్తుంది. ఇలా కొవ్వు పెరగడం వల్ల మరింత ఈస్ట్రోజన్ ఉత్పత్తవుతుంది. ఇలా ఈ విషవలయం కొనసాగుతూనే ఉంటుంది.
అసమతుల్యత కారణాలివే : శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, రుతుస్రావంలో తేడాలు, కుటుంబ నియంత్రణ మందులు వాడడం, సింథటిక్ ప్రొజెస్టిరాన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ప్రొజెస్టిరాన్ తక్కువగా విడుదల కావడం వంటివి హార్మోన్ల అసమతౌల్యతకు దారితీస్తాయి.
సమతుల్యత ఇలా సాధించవచ్చు..
-క వైద్యుల సలహా లేకుండా కుటుంబ నియంత్రణ మందులు వాడుతుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోండి.
- ఫాస్ట్‌ఫుడ్ తినడం తగ్గించాలి. వీలైనంత మేరకు ఆర్గానిక్ ఫుడ్, అదీ జన్యు మార్పులు చెందని ఆహారం తీసుకోవాలి.
- రోజూ తీసుకోవాల్సిన మోతాదులో పోషకాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కనీసం ఓ అరగంటపాటు నడవడం అయినా అలవాటు చేసుకోవాలి.
- ఇవన్నీ చేసినా హార్మోన్లలో మార్పు వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే ఇవన్నీ చేస్తున్నా వెంటనే ఫలితాలు రాకపోతే నిరాశపడకుండా.. పద్ధతులు మార్చేందుకు ప్రయత్నించకండి.