Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరటి తొక్కతో చర్మ సౌందర్యాన్నికాపాడుకోవచ్చు. ఎలాగంటే.. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము, ధూళి, తీసుకునే ఆహారం... ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంటుంది. అలాంటప్పుడు అరటిపండు తొక్క ఈ సమ స్యలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది.
- అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పూతలా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై మత కణాలు తొలగిపోతాయి. ముఖచర్మం తాజాగా, కోమలంగా మారుతుంది.
- అరటిపండు తొక్కను మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు మాయమవుతాయి.. అంతే కాదు.. వాపు సమస్య తగ్గిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఈ పూతను ప్రయత్నిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.