Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య ప్యాంట్ సూట్స్ ట్రెండ్‌కు ఆదరణ బాగా పెరిగిపోయింది. సెలబ్రిటీలు సైతం
సినిమా ప్రమోషన్స్ మొదలుకొని ప్రైవేట్ ప్రొగ్రాంల వరకు వీటికే ఓటేస్తున్నారు. ఓ వైపు
సౌకర్యవంతంగా అనిపిస్తూనే మరోవైపు మనల్ని హుందాగా కనిపించేలా చేయడం
వీటి ప్రత్యేకం. ముఖ్యంగా ఆఫీసులో జరిగే ముఖ్యమైన బోర్డ్ సమావేశాలు, పార్టీలు..
మొదలైన వాటికి ఇవి చక్కని ఎంపిక. మరి, ఎంతగానో పాపులారిటీ సంపాదించి
ట్రెండింగ్ ఫ్యాషన్స్‌లో స్థానం సంపాదించుకున్న ఈ ట్రెండ్‌ని ఎలా ఫాలో అవ్వాలో
మనమూ ఓసారి తెలుసుకుందామా..
రకరకాల డిజైన్స్: సూట్స్ అనగానే కేవలం ప్లెయిన్ కలర్స్‌తో ఉన్న అవుట్ ఫిట్స్ మాత్రమే చాలామందికి గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం వస్తోన్న సూట్స్ ఇందుకు భిన్నం. ఫ్లోరల్, జామెట్రిక్, ప్రింటెడ్.. ఇలా ఎన్నో డిజైన్లలో ఇవి లభ్యమవుతున్నాయి. అంతేకాదు.. ఆసక్తి ఉన్నవారు వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా ధరించవచ్చు. అంటే.. మీ అవుట్ ఫిట్స్‌తోనే మీ క్రియేటివిటీని ప్రదర్శించవచ్చు.
కలర్ కాంబినేషన్స్: ప్యాంట్ సూట్స్‌లో కొన్ని మోనోక్రోమ్ తరహాలో ఒకే రంగులో లభ్యమవుతుంటే.. ఇంకొన్ని రెండు, మూడు రంగుల కాంబినేషన్లో కూడా దొరుకుతున్నాయి. అయితే వీటిలో ఏది ఎంచుకోవాలన్నా అది మీ చర్మఛాయకు నప్పుతుందో లేదో ముందుగా సరిచూసుకోవడం తప్పనిసరి. లేదంటే అందమైన అవుట్ ఫిట్ వేసుకున్నా అది మీ లుక్‌ని అంతగా ప్రభావితం చేయదు.
యాక్సెసరీస్: ప్యాంట్ సూట్స్ ధరించినప్పడు యాక్సెసరీస్ వీలైనంత తక్కువగానే ధరించాలి. సింపుల్‌గా ఉండే చెయిన్, బ్రేస్ లెట్ వంటివి పెట్టుకొని డ్రస్‌కు తగిన విధంగా మేకప్, హెయిర్ స్టైల్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పాదాలకు స్నీకర్స్ లేదా షఉస్ వంటివి వేసుకుంటే బాగుంటుంది.
ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ప్యాంట్ సూట్స్ ధరిస్తే సినీ తారలే కాదు మీరూ ఫ్యాషన్‌గా మారిపోవచ్చు.