Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూర్చున్న చోటు నుండి కదలకుండా 8 గంటల పాటు ఉండటం వల్ల ఊబకాయం సమస్య ఉత్పన్నమవుతుంది.
- ఇలాగే కూర్చుని ఉండడం వల్ల వెన్నుముకకి సంబంధించిన సమస్యలు వస్తాయి.
- ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల మన శరీర జీవక్రియల వేగం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందట.
- ఇక మన శరీరానికి ఏవిధమైన కదలిక లేకుండా ఒకే చోట కూర్చుంటే కండరాల బలహీనత సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. కూర్చుని ఉండడం వల్ల నడుము భాగం కింద ఉన్న అన్ని రకాల కండరాలు బలహీన పడిపోతాయట.
- అటూ ఇటూ నడవకుండా వుంటే అరికాళ్ళు, కాళ్లకు అనుకున్న రీతిలో రక్తప్రసరణ జరగక కాళ్లకు సంబంధించిన సమస్యలు ఎదురవడంతో పాటు కీళ్లు బలహీనంగా మారతాయట.
- ఇక ఒకే చోట కూర్చుని కనీసం తల కూడా అటు ఇటు తిప్పకుండా పని మీదనే దష్టి పెట్టి పనిచేస్తుంటే కొంతకాలం తరువాత మెడ నరాలలో కదలిక లేక కొత్త సమస్యలు వస్తాయి. మెడ నొప్పులు కూడా వస్తాయట.
- మనం ఆహరం తీసుకున్న తరువాత కొద్దిసేపు అటు ఇటు నడిస్తే తీసుకున్న ఆహరం జీర్ణం అవుతుంది. అలా జీర్ణమైన తరువాత వచ్చే పోషకాలు మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా వెళతాయి. అలా కాకుండా తిన్న వెంటనే కదలకుండా ఒకే చోట కూర్చుంటే తిన్నది మొత్తం ఒకే చోట కొవ్వులా పేరుకుపోయి శరీరంలో ఉండే అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మీకు ఊబకాయ సమస్య కూడా వస్తుంది.
- శరీరానికి ఎక్కడా కూడా కదలిక లేకుండా ఉంచి అలాగే శరీరానికి సరిపడా నీరు కూడా అందివ్వకపోతే కిడ్నీలో రాళ్లు వచ్చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- 8 నుండి 10 గంటల పాటు ఒకే చోట కూర్చుని పనిచేసే వారు కచ్చితంగా ప్రతి గంటకు ఒకసారైనా లేచి అటు ఇటు కనీసం రెండు నిమిషాలైనా నడవాల్సి ఉంటుంది. అలా నడవడం ద్వారా మీ శరీరానికి కాస్త కదలిక ఇచ్చినవారవుతారు.
- ప్రతిరోజు 30 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం కూడా పైన చెప్పిన వాటిని ఎదురుకునేందుకు ఉపయోగపడుతుంది.
- ఆఫీస్‌కి వెళ్లే వారు, లిఫ్ట్ లేదా ఎలివేటర్లు వాడడం కన్నా మెట్లు ఎక్కడం మంచిది. ఇలా చేస్తే, మీ శరీర భాగాలకి అవసరమైన కదలిక ఇచ్చిన వారవుతారు.
- జంక్ ఫుడ్ తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
- ఎక్కువగా కూర్చుని పని చేసే వారు, గంట లేదా రెండు గంటలకొకసారి నీరు తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది.
- వీటన్నితో పాటు ఆఫీసు లేదా మీరు పని చేసే చోట కూర్చునే కుర్చీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే సరైన విధంగా లేని కుర్చీలో కూర్చోవడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- మీరు రోజూ వ్యాయామం చేయకపోయినా సరే, వారంలో కనీసం మూడు నుండి నాలుగు రోజుల పాటు రోజుకొక గంటసేపు నడవడం కూడా మీ ఆరోగ్యానికి మంచిది.