Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది ఫ్యాషన్ మీద ఉన్న విపరీతమైన పిచ్చితో రకరకాల వస్తువులు, బట్టలు కొని బీరువాలో సర్దేస్తారు. పదే పదే కొత్త డ్రెస్సులు కొనే బదులు.. ఉన్నవాటితోనే అందమైన వార్డ్ రోబ్ తయారు చేసుకోవచ్చు. కొంతమంది తమకిష్టమైన చీరలు, అనార్కలి డ్రెస్సులు, చుడీదార్స్ పదే పదే కొంటుంటారు. పైగా వాటిని రెగ్యులర్‌గా వాడతారా అంటే.. అది కూడా డౌటే. అవి పాతబడకుండానే.. మళ్లీ కొత్తవి కొనేస్తారు. తర్వాత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టామని బాధ పడుతుంటారు. అలాంటి వారు కూడా ఖర్చు లేకుండా అందమైన వార్డ్ రోబ్ తయారుచేసుకోవచ్చు.
- ప్రతీ నెల మీరు వార్డ్ రోబ్‌ని సర్దుకొనే విధానంలో మార్పులు చేస్తే చాలా ఫలితాలుంటాయి. ఎప్పుడూ పాత దుస్తులనే చూస్తున్నారనే భావన కలగదు. బట్టలు రీ ఎరేంజ్ చేసేటప్పుడు మీకు నచ్చినవాటిని తొలి వరుసలో పెట్టి.. మీకు పెద్దగా నచ్చని వాటిని వెనుక వరుసలో పెట్టండి. అలాగే మీరు కొని కూడా వాడని దుస్తులను మొదటి వరుసలో పెట్టి.. ఎక్కువగా వాడిన వాటిని వెనుక వరుసలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ ఒకే వార్డ్ రోబ్‌ని చూస్తున్న ఫీలింగ్ మీకు కలగదు.
- మీ వార్డ్ రోబ్‌కు మంచి లుక్ రావాలంటే.. నెలకు ఒకసారి మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కొని వాడని మంచి దుస్తులు ఏవైనా ఉంటే వాటిని అడిగి తీసుకోండి. వాటికి కూడా మీ వార్డ్ రోబ్‌లో చోటు కల్పించండి. వీలైతే అలా అడిగి తీసుకున్న దుస్తులను మీరే మళ్లీ రీ డిజైన్ చేసి కొత్త ఫ్యాషన్ లుక్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఖర్చు కూడా కలిసొస్తుంది.
- మీరు వార్డ్ రోబ్ సర్దడం ఒక ఎత్తైతే.. కలర్ కాంబినేషన్ ఆధారంగా విభజించుకోవడం మరో ఎత్తు. అందుకే ఒకసారి మీ క్లోజెట్ మొత్తాన్ని తేరిపారా చూడండి. ఏ శారీకి ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుందో.. ఏ మిడ్డీకి ఏ రంగు స్కర్ట్ మ్యాచ్ అవుతుందో ఒకసారి పరిశీలించండి. వాటికనుగుణంగా క్లోజెట్లో మార్పులు చేస్తే లుక్ అదిరిపోతుంది.
- వార్డ్ రోబ్‌లో దుస్తులతో పాటు ఫ్యాషన్ ఐటమ్స్, నగలు, ఆభరణాలు, జుమ్కీలు మొదలైన వాటికి చోటు కల్పించండి. మీరు దుస్తులను సెలెక్ట్ చేసుకొనేటప్పుడు అందుకు మ్యాచ్ అయ్యే వస్తువులను కూడా కచ్చితంగా ఎంపిక చేసుకోండి. ఇలా చేయడం వల్ల పదే పదే పాత దుస్తులనే ధరిస్తున్నారనే ఫీలింగ్ మీకు రాదు. వార్డ్ రోబ్‌కు కూడా కొత్త లుక్ వస్తుంది.
- మీరే పాత బట్టలను మళ్లీ కొత్తగా రీ డిజైన్ చేయండి. వాటిని మీకు నచ్చినట్లు ఆల్టరేషన్ చేసి మీరే కొత్త డిజైన్స్ తయారుచేయండి. ఇలా చేయడం వల్ల ఖర్చు కూడా కలిసొస్తుంది. అదేవిధంగా మీలో క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది.