Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందిని ఎప్పుడు చూసినా ఆకర్షణీయంగా మెరిసిపోతూ ఉంటారు. ఏ డ్రెస్ వేసుకున్నా అది వారి కోసమే డిజైన్ చేశారా.. అన్నంత చక్కగా వారికి అమరుతుంటాయి. ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చే కొత్త కొత్త ట్రెండ్స్ గురించి తెలుసుకుంటూ వాటిలో తమకు అనుగుణంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవడంతో పాటు కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అయితే చాలు.. ఎవరైనా సరే ఫ్యాషన్ క్వీన్ అనిపించుకోవాల్సిందే. ఆ రూల్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం...
వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి
మన వస్త్రధారణ ఏ విధంగా ఉన్నా సరే అవి మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయంటున్నారు డిజైనర్లు. అందుకే మన వస్త్రధారణ కూడా ఎదుటివ్యక్తితో కమ్యూనికేషన్ జరిపేందుకు ఒక మార్గంగా భావిస్తారు. కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ధరించే దుస్తులు మన గురించి ఎంతో కొంత అవతలి వారికి అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే ఈసారి మీ మనసు, మీరు ఉన్న మూడ్‌కి అనుగుణంగానే మీ వస్త్రధారణను కూడా ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించండి.
సందర్భానికి తగ్గట్టు
రోజూ మనం ధరించే దుస్తులు ఒక ఎత్తైతే పెండిండ్లు, శుభకార్యాలు వంటి వేడుకల్లో పాల్గొనేటప్పుడు ధరించే దుస్తులు మరొక ఎత్తు. అందుకే చాలామంది ఇలాంటి సందర్భాల్లో చాలా ప్రత్యేకంగా కనిపించాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఫ్యాషన్ నియమాల ప్రకారం ఇది కాస్త మంచిదే. అయితే ఈ నియమాన్ని కేవలం ప్రత్యేక వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి అకేషన్‌కు దానికి తగినట్లుగా డ్రెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా మన లుక్ ఎదుటివారిని ఆకర్షిస్తుందంటున్నారు డిజైనర్లు.
సరిగ్గా సరిపోతుందా
మనం ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు మనసుకు నచ్చిన మంచి డ్రెస్ మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోదు. అది మన శరీరాకతికి తగినట్టు ఉందా? లేదా? అన్నది సరిచూసుకోవాలి. లేదంటే డ్రెస్ కనిపించినంత అందంగా, ఆకర్షణీయంగా మనం కనిపించే అవకాశం ఉండదు. అందుకే ఈసారి మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా సరే.. అవుట్‌ఫిట్ లుక్‌తో పాటు అది మీకు ఫిట్‌గా ఉంటుందో, లేదో కూడా సరిచూసుకోవడం మరవకండి. ఫిట్‌గా ఉండే దుస్తులు సింపుల్‌గా ఉన్నా మన లుక్‌ని స్టైలిష్‌గా మార్చేస్తాయి.
ప్రయోగాల విషయంలో...
ఫ్యాషన్ విషయంలో కొత్త ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చిన్న చిన్న ప్రయోగాలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో ఏయే ట్రెండ్స్‌తో ప్రయోగాలు చేయచ్చో, ఏవైతే మీకు బాగా నప్పుతాయో కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఏయే సంద ర్భాల్లో ఇలా ప్రయోగాత్మకంగా డిజైన్ చేసుకున్న దుస్తులను ధరించాలో తెలుసుకోవడం కూడా అవసరమే. అంటే నలుగురిలోనూ హుందాగా నడుచుకోవాల్సిన సందర్భాల్లో ఈ ప్రయోగాలకు దూరంగా ఉండడమే శ్రేయ స్కరం. ఇక స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లినప్పుడు, ముఖ్యమైన వ్యక్తులను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక వస్త్రధారణలో ప్రత్యేకంగా మెరిసిపోవచ్చు.
మీ సిగేచర్ ఉండాల్సిందే..
ప్రస్తుతం ప్రతిఒక్కరికీ ఓ ప్రత్యేక మైన సిగేచర్ స్టైల్ ఉండడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో దానికి ప్రాధాన్యం ఇస్తూ ఆ స్టైల్‌కి మరింత స్పెషల్ లుక్‌ని ఇచ్చే అవుట్ఫిట్స్నే ఎంపిక చేసుకోవాలి తప్ప మార్కెట్లోకి కొత్తగా వచ్చిందనో లేక నలుగురూ ఆ ట్రెండ్‌ని అనుసరిస్తున్నారనో దానిని అనుసరించకూడదు. ఈ నియమం కేవలం దుస్తులకే కాదు.. మనం ఎంపిక చేసుకునే యాక్సెసరీస్‌కి కూడా వర్తిస్తుంది.
పర్సనల్ టచ్ ఇవ్వాల్సిందే..
ట్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు. మరి ఆయా ట్రెండ్స్ ఫాలో కావడంలో మీ ప్రత్యేకత ఏంటి అంటే.. ఫాలో అవ్వాలని ఎంపిక చేసుకున్న ప్రతి ట్రెండ్‌కూ మనదైన శైలిలో స్పెషల్ పర్సనల్ టచ్ ఇవ్వాల్సిందే! అది అవుట్‌ఫిట్‌కి జత చేసే యాక్సెసరీస్ కావచ్చు.. లేదా దానికి తగ్గట్టుగా వేసుకునే మేకప్ విషయంలో కావచ్చు. మనం చేసే మార్పు చిన్నదే అయినా దాని ప్రభావం మన అవుట్‌లుక్ పై కనిపించినప్పుడు మనం నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.
ఫిట్ జీన్స్ తప్పనిసరి
ఈ రోజుల్లో అమ్మాయిల వార్డ్ రోబ్‌లో ఎన్ని ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్ ఉన్నా ఫిట్‌గా ఉండే జీన్స్ ఒక్కటైనా లేకపోతే ఆ వార్డరోబ్ అసంపూర్ణంగానే మిగిలిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. సో.. ఎన్ని ట్రెండ్స్ ఫాలో అవ్వాలనుకున్నా, మీదైన శైలిలో వాటికి పర్సనల్ టచ్ ఇవ్వాలన్నా జీన్స్ వంటివి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటికి మీ వార్డ్ రోబ్‌లో స్థానం ఇవ్వడం మరిచిపోవద్దు.