Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని రకాల ఆహారపదార్థాలు తినడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా మారిపోతాం. అన్నిరకాలుగా మనకు ప్రయోజనాలు అందుతాయి. అందుకే వాటిని సూపర్ ఫుడ్స్ అంటాం. గింజలు, సుగంధద్రవ్యాలు, ఇతర బెర్రీల్లా ద్రాక్ష పండ్లు కూడా మంచి ఆహారంగా పేరు సాధించాయి.
- ద్రాక్షపండ్లు యాంటీఆక్సిడెంట్ల ఖజానా అని చెప్పవచ్చు. వీటిలో చాలా రకాల యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
- ద్రాక్షలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బీ6, ఫోలేట్లు లభిస్తాయి. ఇవన్నీ మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో అవసరం.
- ఈ పండ్లు క్యాన్సర్, అల్జీమర్స్, గుండె సమస్యలను తగ్గిస్తాయి.
- ద్రాక్ష పండ్లు ఎక్కువమందిలో ఉన్న చర్మ సమస్యలైన మొటిమలు, ముడతలను తగ్గిస్తాయి.
- ద్రాక్ష పండ్లలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.
- మన శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించే ప్రొటీన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రొటీన్లు చర్మానికే కాదు.. కంటి చూపుకి కూడా ఎంతో మంచివి.
- ఈ పండులో వుండే రెస్వేరెట్రోల్ శరీరం నుంచి మెదడుకి వెళ్లే రక్త సరఫరా వేగాన్ని పెంచుతుంది. దీని వల్ల మెదడుకి ఎక్కువ మొత్తంలో రక్తం అంది చురుగ్గా పనిచేస్తుంది.
- శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడం ద్వారా వివిధ వ్యాధులు రాకుండా అడ్డుకోవడంతో పాటు చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా చూస్తుంది. ఇంతకుముందు ఉన్నవాటిని తొలగిస్తుంది.
- ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు మన కీళ్లకు సాగే గుణాన్ని, శక్తిని అందిస్తాయి. అందుకే ఇవి మోకాళ్ల సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచివి.
- ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాలను కాస్త వెడల్పుగా మార్చి రక్తప్రసరణ సులువుగా, సజావుగా సాగేలా చేస్తాయి. అంతేకాదు.. ఇవి గుండె, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.