Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి సంతోషాన్ని పంచితే, ఒక్కోసారి వైఫల్యం బాధను మిగులుస్తుంది. విజయం ఉత్సాహాన్ని ఇస్తే, వైఫల్యం మాత్రం చాలా కుంగదీస్తుంది. మనిషులకి నానాటికీ డిప్రెషన్‌కి లోనవుతుంది. ఫలితంగా తమపై తామా పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతారు. ప్రతి ఒకరూ ఎప్పుడో అప్పుడు ఏదో విషయంలో బాధపడుతూనే ఉంటారు. కానీ ఈ బాధ, నిస్సహాయాత మనల్ని డామినేట్ చేయడం మొదలుపెడితే దానిని డిప్రెస్సివ్ డిజార్డర్ అని అంటారు.
ఈ డిప్రెసివ్ డిజార్డర్లోను రెండు రకాలు ఉన్నాయి. మొదటిది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అయితే రెండవది డైస్తిమిక్ డిజార్డర్. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ సాధారణంగా రెండు మూడు వారాలు మనిషిని డిప్రెషన్లో ఉండేలా చేస్తుంది. ఫలితంగా నిద్రలేమి, తిండిపై అయిష్టత పెరగడం, బరువులో మార్పు, ఏకాగ్రత లోపించడం, తనపై తానూ నమ్మకాన్ని కోల్పోవడం, ఒక్కోసారి ఈ డిప్రెషన్లో ఉన్నవారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మనిషిలో కొద్ది కాలమే ఉన్నా, దాని ఫలితాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులుగానీ, స్నేహితులు గానీ మనస్థైర్యాన్ని ఇస్తే వీరు త్వరలోనే ఈ డిజార్డర్ నుండి బయటపడగలరు.
రెండవది డైస్తిమిక్ డిజార్డర్. ఇది సాధారణంగా 16 ఏండ్ల వరకు ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. డైస్తిమిక్ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లా ఒక్కసారిగా ప్రభావం చూపకపోయినా అప్పుడప్పుడు మనిషిని పూర్తిగా నిరుత్సాహ పడేలా చేస్తుంది. ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారో, ఎప్పుడు డిప్రెస్ అయిపోతారో చెప్పడం కష్టం. వీరిలోనూ ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తనపై తాను నమ్మకం కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. డిప్రెషన్ ఎలాంటిదైనా ఈ లక్షణాలు ముఖ్యంగా సెన్సిటివ్‌గా ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కుటుంబంలోని వారి మధ్య ఉండే సాన్నిహిత్యం, తను పెరిగిన పరిస్థితుల ప్రభావం కూడా డిప్రెషన్‌కి కారణమవుతుంది. ఒక్కోసారి మనకు ఎంతో సంతోషాన్ని, బలాన్ని ఇచ్చిన సంఘటనలు, పరిస్థితులు తారు మారయినప్పుడు అవే బలహీనతలైపోతాయి.
రండు వారాలలోపు మీరు డిప్రెషన్‌లోంచి బయటపడటం లేదు అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి. డాక్టర్ సలహాతో పాటు ఈ కింది జాగ్రత్తలు పాటించండి.
- వీలైనంత విశ్రాంతి తీసుకోండి.
- పోషకాహారం తినండి.
- ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి.
- మీకిష్టమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండండి.
- వీలైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపడానికి ప్రయత్నించండి.
- కౌన్సెలింగ్ తీసుకోండి, వారిచ్చే సలహాలు మీకు ధైర్యాన్ని, ఊరటను కలిగించవచ్చు.
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోండి. ఇది చేపల్లో అధికంగా ఉంటుంది. విటమిన్ బి9 ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
వీటన్నింటి కంటే ముందు డిప్రెషన్ లోంచి బయటపడాలి అంటే ముందుగా మీరు దానికి సిద్ధపడాలి. మీ ప్రయత్నం లేకుండా ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత కౌన్సెలింగ్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అన్న మనస్థైర్యాన్ని అలవరుచుకోండి. సంతోషంగా ఉండండి.