Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతో బిజీగా ఉండి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కొందరు చాలా చురుకుగా కనిపిస్తారు. దీనికి కారణం సమయపాలన, అధికశక్తి. మరికొందరు ఎక్కువ పని చేయకపోయినా ఊరికే అలసిపోయినట్టు కన్పిస్తారు. వీరికి అధికశక్తి లేకపోవడమే ప్రథమ కారణమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే వయసు గలవారిలో కొందరికి శక్తి అధికంగా ఉండటం మరికొందరికి శక్తి లోపించడానికి వంశపారంపర్యం, హార్మోన్ల సమతుల్యత శరీరంలో కండరాల్లో ఉండే కొవ్వు తీవ్రత, వాడే మందులు వంటి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అందుకే త్వరగా అలసిపోయే వారు అలసటకు దూరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు...
- జీర్ణక్రియ సరిగా లేకపోవడం అలసటకు ప్రథమ కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం బాగా జీర్ణమయి ఒంటికి పడితే మంచి శక్తి వస్తుందని వారు సూచిస్తున్నారు. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు కావలసినంత నీటిని సేవించండి.
- ఆకుకూరలు ప్రతిరోజూ ఒక పూట వాడండి. నిద్రించేందుకు ముందుగా గ్లాసుడు పాలు, ఓ అరటిపండును తిని పడుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు.
- ఆకుకూరలను సూప్ విధానంలో తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా ఉంటుంది. కొత్తిమీర, అల్లం, జీలకర్రలను వంట్లో అధికంగా చేర్చండి.
- సమయానికి తినడం చేస్తే జీర్ణక్రియకు సలుభమై శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తినడం మానస్తే మంచిది.