Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీరదోస, తేనె : కీరదోసను సన్నగా తురమాలి. తురిమిన కీరదోసను పలుచని వస్త్రంలో వేసి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి. రెండు చెంచాల తేనెకు చెంచా కీరదోస రసం కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కండ్ల చుట్టూ అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
పసుపు, నిమ్మరసం, తేనె : చిన్న గిన్నెలో టీస్పూన్ తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని కండ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాల పై రాసి రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. పూర్తిగా ఆరేంత వరకు ఆగి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.
అరటి, తేనె : బాగా మగ్గిన అరటి పండు ముక్కను తీసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కండ్ల చుట్టూ సమానంగా అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిత్యం ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.
పాలు, తేనె : కాస్త వేడిగా ఉన్న పాలల్లో టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ ఉన్న చోట అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ చిట్కాను వారంలో మూడు సార్లు పాటిస్తే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
టమాట, తేనె : టేబుల్ స్పూన్ చొప్పున తేనె, టమాట గుజ్జు తీసుకొని మిశ్రమంగా చేసి కండ్ల చుట్టూ అప్లై చేయాలి. పది నిమిషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజుకి రెండు సార్లు అంటే ఉదయం, సాయంత్రం ఈ చిట్కాను పాటిస్తే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. కొత్తవి ఏర్పడకుండా ఉంటాయి.
పెరుగు, తేనె : టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, తేనె తీసుకొని మిశ్రమంగా చేయాలి. దీన్ని కండ్ల చుట్టూ అప్లై చేసి 20-25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.