Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా ఉద్యోగంలో చేరిన కొందరు యువతీ యువ కులు ఆర్థిక స్వాతంత్రం వచ్చినందుకు ఎంతో సంబర పడిపోతుంటారు. అప్పటి వరకు ప్రతి చిన్న ఖర్చుకు తల్లిదండ్రులపై ఆధారపడిన వారికి తమ సంపాదన చేతికందగానే చెప్పలేని సంతోషం. సంపాదించడం మొదలు పెట్టగానే కాస్త పొదుపు కూడా అవసరమని పెద్దలు చెబితే పెద్దగా చెవికి ఎక్కించుకోరు. కొంతకాలం ఎంజారు చేయనీయండీ అంటుంటారు. విలా సాల మోజులో పడి వచ్చే ఆదాయాని కన్నా ఖర్చులు ఎక్కువైతే...
ఖర్చులకు డబ్బు సరిపోకపోతే చాలా బాధ పడతారు. తమ అలవాట్లు ఎలా ఉన్నా యో మాత్రం గమనించరు. పైగా తమ జీతం తక్కువగా ఉందని.. తల్లిదండ్రులు ఖర్చులకు తగినంత డబ్బు ఇవ్వట్లేదని కన్నవారిని నిందిస్తుంటారు. కొంతమంది విషయం లో సంపాదన తక్కువగానే ఉన్నా.. ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. దాంతో ఆదా చేయడం వారి వల్ల కాదు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమి టంటే.. రోజువారీ జీవితంలో చాలామందికి ఉండే ఈ అలవాట్లు ఖర్చులు పెంచేస్తాయి. ఈ క్రమంలో మీక్కూడా ఈ అలవాట్లు ఉన్నాయేమో ఓసారి పరిశీలించుకోండి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించు కునేందుకు వాటికి దూరంగా ఉండండి.
బయటి భోజనం వద్దు
సాధారణంగా ప్రతి శుక్రవారం లేదా శనివారం మిత్రులతో బయటకు వెళ్లి ఎంజారు చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వల్ల అది కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ కరోనా ప్రభావం తర్వాత పరిస్థితి ఏంటి? చాలా రోజులైపోయింది బయటకు వెళ్లి అని మళ్లీ పాత అలవాటునే మొదలుపెడతారు. ఇలా ప్రతీసారి స్నేహితులతో పార్టీలకు వెళ్లడం, రెస్టారెంట్లో భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇది మీ ఖర్చులను పెంచేస్తుంది. అలా కాకుండా ఇంట్లోనే చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసుకోవడమో లేదా కలిసి తినడమో చేయవచ్చు. ఇలా చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే నెలలో రెండు సార్లు బయట తింటే మరో రెండు సార్లు ఎవరో ఒకరి ఇంట్లో పార్టీ చేసుకోవడం మంచిది.
ఖరీదైనవి అవసరమా?
చాలామంది చర్మ పరిరక్షణ కోసం వివిధ ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వాటికోసం మరీ ఎక్కువ ఖర్చు చేయడం సరికాదు. లగ్జరీ ఉత్పత్తులు ఉపయోగించే ముందు తక్కువ ధరకు లభ్యమయ్యే బ్రాండ్లను ఉపయోగించడం మంచిది. కొన్నిసార్లు అవి కూడా లగ్జరీ ఉత్పత్తులతో సమానంగా పనిచేస్తాయి. సాధారణంగా మరీ ఖరీదైన ఉత్పత్తులుగా భావించేవి మనకు అంతగా అవసరం లేకపోవచ్చు. అందుకే ఈ విషయం చాలా జాగ్రత్తగా వుండాలి. మీ చర్మతత్వానికి అనుగుణమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి. అసలు వీటికి బదులు ఇంట్లోనే సహజమైన వస్తువులతో చర్మాన్ని కాపాడుకునే చిట్కాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే మరీ మంచిది.
షాపింగ్‌కి వెళుతుంటే
మనం సూపర్ మార్కెట్లో సామాన్లు కొనడానికి వెళ్తున్నప్పుడు ముందే లిస్టు రాసుకోవడం చాలా మంచిది. లేకపోతే మనకు అవసరం లేని వస్తువులెన్నింటినో కొనేస్తాం. మార్కెట్లలో వస్తువులన్నీ చూడడానికి కొత్తగా కనిపిస్తాయి. దాంతో అవసరమున్నా లేకపోయినా మనకు వాటిని కొనేయాలని అనిపిస్తుంది. కనుక ముందే లిస్టు రాసుకొని వెళ్లడం వల్ల అవసరమైనవి మాత్రమే కొనే వీలుంటుంది.
అకౌంట్స్ షేర్ చేసుకోండి
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్.. ఇలా కనిపించే ప్రతీ సినిమా సైటుకీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. మీ బ్యాంక్ బ్యాలన్స్‌కి గండి పడ్డట్టే. కనుక మీకు ఆసక్తి ఉన్న సైటుకి మాత్రమే చందాదారులుగా చేరండి. వీలుంటే మీ స్నేహితులతో కలిసి ఒక్కొక్కరూ ఒక్కో సబ్స్క్రిప్షన్ తీసుకొని అకౌంట్స్ షేర్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీ ఖర్చు తగ్గుతుంది.
రోజూ కేఫ్‌కి పోతున్నారా?
రోజూ మీకు కాఫీ తాగే అలవాటుందా.. అయితే మీరు పొదుపు మంత్రాన్ని కచ్చితంగా ఫాలో అవ్వడం లేదు. కాఫీ తాగడానికి అంత ఖర్చవుతుందా.. ఒక కప్పు కాఫీ తాగితే ఏమవుతుంది.. అనుకుంటున్నారా.. రోజూ మీ ఆఫీస్ పక్కనున్న కేఫ్ నుంచి కాఫీ తెప్పించుకొని తాగితే.. కనీసం 50 రూపాయలు ఖర్చవుతుంది. ఇలా నెల మొత్తం లెక్కించండి. అప్పుడు మీ పర్సుకు రంధ్రం పడినట్లే కదా. దీని కంటే తాజా కాఫీని ఫ్లాస్కులో నిల్వ చేసి మీ వెంట తీసుకెళ్లడం మంచిది.
విద్యుత్ విషయంలో కూడా
చాలామంది లైట్లు, ఏసీలు ఆఫ్ చేయడం తరచూ మర్చిపోతుంటారు. వీటి అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం వల్ల పర్యావరణానికే కాదు మీ అకౌంట్ బ్యాలన్స్‌కి కూడా మంచిది. అందుకే విద్యుత్తును వీలున్నంతగా పొదుపు చేయడం మంచిది.
జిమ్‌లో మెంబర్షిప్ తీసుకుంటున్నారా?
అయితే ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా బాడీ ఫిట్నెస్ కోసం అనేకమంది ఖరీదైన జిమ్‌లో మెంబర్షిప్స్ తీసుకుంటుంటారు. పర్సనల్ ట్రైనింగ్, ఫిట్నెస్ క్లాసులు అంటూ చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ వాటికి వెళ్లేది మాత్రం చాలా తక్కువే. ఇలా చేయడం వల్ల మీరు కట్టిన డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఫిట్‌నెస్‌ని మీ లైఫ్‌స్టైల్‌గా మార్చుకోవాలని భావిస్తే ముందు పార్క్‌లో పరుగెత్తడం, సైకిల్ తొక్కడం వంటివి చేయండి. రోజూ వ్యాయామం చేయడం అలవాటయ్యాక ఆ తర్వాత జిమ్ మెంబర్షిప్ తీసుకోవడం మంచిది.