Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా గడపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు తప్పనిసరి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం అందరికీ సహజమే. అయితే వచ్చిన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టుకురావాల్సిందే. సమస్యల నుండి తెలివిగా బయటపడి మన జీవితాన్ని ఆనందంగా గడపడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
ఒకదాని తర్వాత ఒకటి
మీ రోజువారీ జివితంలో మీకొచ్చే ఆలోచనలను డైరీలో రాసుకోండి. అంటే, మీతో మీరు నిరంతరం జరిపే సంభాషణను కాగితం మీద పెట్టడమే. మల్టీ టాస్కింగ్ చేయకండి. ప్రపంచంలో కేవలం రెండు శాతం మంది మాత్రమే మల్టీ టాస్కింగ్ చేయగలరట. మీరు ఆ రెండు శాతంలో ఉంటే తప్ప హాయిగా ఒక పని తరువాత ఒక పని చేసుకోండి. అప్పుడప్పుడూ పగటి కలలు కనడంలో తప్పు లేదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల మెదడు బాగా రిలాక్స్ అవుతుందట.
టెక్నాలజీని ఉపయోగిస్తూనే
మీ జీవితాన్ని ఒకరితో పోల్చుకోవడం లాంటివి చేయకండి. ఎవరి జీవితం వారిదే. ఇది చెప్పడం తేలిక, చేయడం కష్టం. కానీ ప్రయత్నం మీద సాధించవచ్చు. పూర్తిగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోండి. ముందు ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం చేస్తూ ఉంటే నెమ్మదిగా అలవాటైపోతుంది. టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రధాన్యం ఇవ్వండి. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ నుండి దూరంగా వెళ్ళలేం కానీ, టెక్నాలజీకి బానిస అవ్వాల్సిన అవసరం కూడా లేదని గుర్తుపెట్టుకోండి.
అక్కర్లేనివి చేయకండి
నడుస్తూ మ్యూజిక్ వినడం, ట్విట్టర్ చెక్ చేయడం, క్యాబ్‌లో కూర్చుని చాట్ చేయడం... ఇవన్నీ మంచి పద్దతులు కావు. నడుస్తున్నప్పుడు నడక మీదే దష్టి ఉండాలి. మీ క్యాలెండర్‌ను ఒక సారి చెక్ చేసుకోండి. ఏమి చేయలో, ఏమి చేయనక్కర లేదో ఇంకోసారి ఆలోచించండి. ఆక్కర్లేనివి చేయకండి. ఆ సమయాన్ని మీకే కేటాయించండి. సహానుభూతి చెందండి. మరొకరు మీతో పంచుకునే విషయాలను వారి వైపు నుండి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.
బెంగ పడకండి
టీవీ చూస్తూనో, చాటింగ్ చేస్తూనో తినడం కంటే ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో అవగాహనతో ఆహారం తీసుకోవడం వల్ల ఎంత అవసరమో అంతే తీసుకుంటాం. జంక్ ఫుడ్ అలవాటు కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. భవిష్యత్తు గురించి బెంగ పడకండి. మీరు వర్రీ అవ్వడం వల్ల రేపు జరిగే పనులు ఇవాళే అయిపోవు కదా. చిన్న విషయాలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వండి. అప్పుడు లైఫ్ అంతా సంతోషంగానే ఉంటుంది. మీ జీవితంలో మీరు ఆనందించే విషయాలకు కతజ్ఞులై ఉండండి. అనవసరమైన సామాను ఇంట్లోనించి తీసేయండి.
ఇష్టమైన పని చేయండి
మీ మైండ్-బాడీ కనెక్షన్‌ని ఇంప్రూవ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, మీ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడూ ఫోన్ పక్కన పెట్టేయండి. అప్పుడప్పుడూ అయినా మీకు బాగా ఇష్టమైన పని చేయండి. మీ వర్క్ నుండి అప్పుడప్పుడూ బ్రేక్స్ తీసుకోండి. కొంచెం నడవండి, ముఖం మీద నీళ్ళు చల్లుకోండి. మీకు వీలైతే, మీకు ఇష్టమైతే ట్రావెలింగ్ చాలా బావుంటుంది. మంచి ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైనా మరీ కోపంగా అనిపిస్తే, మూడు సార్లు దీర్ఘశ్వాస తీసుకోండి. అప్పుడు మాట్లాడండి.
అతి ఆలోచన వద్దు
జీవితం ఉద్దేశ్యం గమనమే. ఎక్కడైనా ఆగామంటే ఇంక ఆగిపోడమే. ఈ సూత్రం మనసుకి కూడా వర్తిస్తుంది. మనం గతం గురించే ఆలోచిస్తూ ఉన్నా, భవిష్యత్తు గురించి భయపడుతున్నా మానసిక శక్తి నశించిపోతూ ఉంటుంది. నిజానికి, సరిగ్గా ట్రెయిన్ చేయకపోతే మన మైండ్ అత్యుత్సాహానికీ, అయిష్టానికీ మధ్య తిరుగుతూ ఉంటుంది. దీన్ని సైంటిఫిక్ టెర్మినాలజీలో డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. దీని వల్ల ఒకే ఆలోచనలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ అతి ఆలోచన అలసటని కలిగించడమే కాక మెంటల్ ఎబిలిటీస్నీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్నీ, ఐక్యూనీ దెబ్బ కొడుతుంది. దాంతో నెమ్మదిగా ఒత్తిడి, డిప్రెషన్, నెగెటివిటీ అన్నీ చేరుకుంటాయి. అందుకనే మైండ్‌కి కూడా ట్రెయినింగ్ ఇవ్వాలి. మెడిటేషన్, మైండ్ ఫుల్నెస్ ఇందుకు బాగా పనికొస్తాయి.
ప్రమాదం కూడా ఉంది
ప్రస్తుతం మనం ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ యుగంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాక్టీస్‌ని మైండ్లెస్గా చేసేసే ప్రమాదం కూడా ఉంది. దీనిని నిజంగానే ప్రమాదం అనాలి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారి మైండ్ ప్రశాంతంగా, ఆనందంగా, ఆత్మావలోకనంతో ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయి రోజు వారీ కార్యక్రమాల్లోకి అడుగు పెట్టిన తరువాత డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఆన్ అయిపోతుంది. దీంతో వీరు ఇష్టం - అయిష్టం, ఆశ నిరాశ, ప్రేమ - ద్వేషం, ఆనందం - బాధ... ఇలాంటి భిన్న ధవాల మధ్య నిరంతరం తిరుగుతూ ఉంటారు. నెమ్మదిగా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఏం లాభం అనుకుని పూర్తిగా ప్రాక్టీస్‌ని వదిలేస్తారు.
ప్రాక్టిస్ని సరిగ్గా ఎలా చేయాలి?
మెడిటేషన్ అంటే ఒక పక్కన కూచుని ఐదు నిమిషాలు చేసేది కాదు. మెడిటేషన్ అంటే అదొక జీవనశైలి. మీ కాన్షస్, అన్ కాన్షస్ మైండ్స్ మధ్య ఒక వారధి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు వచ్చే శాంతి మొత్తం రోజు వారీ జీవితంలో, ఆలోచనల్లో కనపడాలి. దీన్నే మెడిటేటివ్ లివింగ్ అంటారు. ఈ స్టేజ్‌కి చేరుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ మానకూడదు. కాన్సన్ట్రేషన్ బేస్డ్ టెక్నిక్స్ కంటే ఎవేర్నెస్ బేస్డ్ టెక్నిక్స్‌ని ప్రిఫర్ చేయాలి. ఈ సమయంలో వచ్చే ఆలోచనలన్నీ గమనించాలి. అయితే, ఈ గమనించేటప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ ఉండకూడదు. దీని వల్ల వాల్యూ-జడ్జిమెంట్ అనే ట్రాప్‌లో నుండి బయటకు రాగలు గుతాం. ఇలా చేయడం వల్ల ప్రాక్టీస్‌కి టైమ్ లేదనీ, రోజంతా ప్రాక్టీసే అనీ తెలుస్తుంది. ఇందువల్ల వచ్చే లాభాలు అపరిమితంగా ఉంటాయి. ఫోకస్ పెరగడం, ఆలోచన తీక్షణ మవ్వడం, అక్కర్లేని ఆలోచనలు లేని మెదడు... లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే.