Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా, లాక్డౌన్ వల్ల గతం కంటే సోషల్‌మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా దీని ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుందని కొన్ని సర్వేల్లో తేలింది. అందుకే చాలా మంది సోషల్‌మీడియా వాడకాన్ని కంట్రోల్ చేసుకుందా మనుకుంటారు. కానీ ఆచరణలో సాధ్యం కాదు. నిజంగా కంట్రోల్ చేసుకోవాలని భావించే వారికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.. అవేంటో చూద్దాం...
- సోషల్ మీడియా యాప్స్‌ని డిలీట్ చేసేయండి. ముందు పన్నెండు గంటల పాటూ మీ ఫోన్లో సోషల్ మీడియాని ఆఫ్ చేసి ప్రయోగం చేసి చూడండి. ఆ తరువాత ఈ యాప్స్‌ని డిలీట్ చేయడం తేలిక అవుతుంది.
- సోషల్ మీడియాకి దూరంగా ఉందామన్న ఒక ఫ్రెండ్‌తో కలిపి ఈ డీటాక్స్ ప్రోగ్రాంని మొదలుపెట్టండి. అప్పుడు ఇద్దరూ కలిసి కొన్ని గోల్స్ పెట్టుకుని వాటిని రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మరొకరితో కలిసి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ పనైనా చేయడం తేలిక అవుతుంది.
- మీరు ఏ సోషల్ మీడియా యాప్స్‌ని ఎక్కువ చూస్తున్నారో ఒక అంచనాకి రండి. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో లెక్క వేసుకోండి. ఆ టైంలో ఇంకేదైనా క్రియేటివిటీగా చేయవచ్చేమో ఆలోచించండి.
- మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. చాలా సార్లు మీ గురించి మీ కంటే మీ దగ్గర వారికీ, మిమ్మల్ని ప్రేమించే వారికీ ఎక్కువ తెలుస్తుంది. మీ ఫోన్‌తో మీ రిలేషన్షిప్ గురించి వారు ఏమనుకుంటున్నారో అడగండి. డిన్నర్ మధ్యలో మెసేజ్‌లు చెస్తున్నారో, వారితో మాట్లాడుతూ మధ్యలో హఠాత్తుగా ఫోన్ చెక్ చేసుకుంటున్నారో తెలుస్తుంది.
- మీ ఫోన్ చుట్టూ రబ్బర్ బ్యాండ్ పెట్టండి. ఫోన్ తీసినప్పుడల్లా ఆ రబ్బర్ బ్యాండ్ కనపడగానే ఒక్క సారి ఫోన్ ఎందుకు తీస్తున్నామో, అది అవసరమైన పనా కాదా గుర్తొస్తుంది.
- సోషల్ మీడియా కోసం ఎంత సమయం కేటాయిస్తున్నామో స్పష్టంగా తెలిసి ఉండాలి. ముందు అవగాహన ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు.
- ఫోన్‌కి కూడా నిద్ర కావాలండీ. రాత్రి తొమ్మిదో, పదో తరువాత దానికి చార్జ్ పెట్టేయండి. ఛార్జింగ్ అయిపోయిన తరువాత కూడా దాన్ని మీ పక్కన పెట్టుకోకండి. ఛార్జ్ తీసేసి అక్కడే ఉంచండి. మళ్ళీ మర్నాడు పొద్దున్నే మీరు ఫోన్ పట్టుకునేది.
- ఫోన్లో అలారం పెట్టుకోవడం మానేయండి. ఒక అలారం క్లాక్ కొనుక్కోండి. ఫోన్లోనే అలారం ఉంటే లేస్తూనే ఆ మాయలో పడిపోతాం.
- మీ హౌం స్క్రీన్ మీదే సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఉండటం కంటే వాటిని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే ఈజీగా యాక్సెస్ కొంత తగ్గుతుంది.
- ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్ర పట్టడం వంటి వాటితో పాటూ మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది. దానితో పాటు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే అవగాహన కూడా ఉంటుంది. ఈ అవగాహన సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించు కోవడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది.