Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంసం, చేపలు, గుడ్లు, పౌల్ట్రీ వంటి అన్ని జంతు ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించండి.
- నెయ్యి కాస్త తగ్గించుకుంటే మంచిది. దీనికి బదులు పల్లీలు తీసుకోవచ్చు. ఎందుకంటే వాటిలో ఫైబర్ శరీరంలోకి కొవ్వు విడుదలయ్యే వేగాన్ని తగ్గిస్తుంది.
- ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది. ప్యాకేజీ చేసిన ఆహారాలు సాధారణంగా కొవ్వులతో నిండి వుంటాయి. ఈ వస్తువులను తయారీదారులు ఎక్కువ కాలం నిల్వ వుంచేందుకు కావలసినవి కలుపుతారు.
- అధిక ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. రోజుకు 6గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. ఉప్పుకు బదులు మిరియాలు, జీరా పౌడర్, మిరప, నిమ్మరసం వంటివి వాడండి. రొట్టెలు తినవచ్చు. రెడీగా వుండే మాంసాహారం ఉప్పుతో నిండి వుంటుంది కనుక మానుకోండి.
- కాఫీ రక్తపోటును పెంచుతుంది. కాఫీ ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, రక్తపోటు ఉన్న రోగిపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కాఫీ తాగండి.
- మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలను చేర్చండి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
- ఆహారంలో గోధుమలు, ధాన్యాలు చేర్చండి. వీటిలో ఉండే ఫైబర్ ఆర్టియరీలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. రక్తాన్ని మరింత ద్రవంగా, కొవ్వును చాలా నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి విడుదల చేయడం ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది.
- సూర్యరశ్మి నుండి తగినంత విటమిన్ డి, పాలు, తణధాన్యాలు, పెరుగు మొదలైన బలవర్థకమైన ఆహారాలను తీసుకోవాలి.
- చేపలు, అవిసె గింజల వంటి మంచి కొవ్వులను ఎన్నుకోండి. ఎందుకంటే అవి బరువును నియంత్రిస్తాయి.