Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, నిమ్మకాయ ఒకటి, పెరుగు తీసుకోవాలి. హెన్నా పౌడర్‌లో పెరుగు, నిమ్మరసం వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తల పూర్తిగా ఆరిన.. తర్వాత కండిషనర్ రాసుకోవాలి. నిమ్మరసం వల్ల ఈ ప్యాక్ వేసుకొన్నప్పుడు కాస్త మంట పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ చుండ్రు సమస్యకు ఇది చక్కటి పరిష్కారం.
- హెన్నా పౌడర్ నాలుగు టేబుల్ స్పూన్లు, కుంకుడుకాయల పొడి రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఓ గిన్నెలో హెన్నా పౌడర్, కుంకుడుకాయల పొడి కలిపి మిశ్రమంగా చేయాలి. దీనిలో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ తలకు అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వారానికోసారి అప్లై చేసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన కుంకుడు కాయలు.. మాడును మొత్తం శుభ్రం చేసి చుండ్రు రావడానికి కారణమైన ఫంగస్‌ను నాశనం చేస్తుంది.
- హెన్నా నాలుగు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, మెంతుల పొడి చెంచా, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. శుభ్రమైన గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 12 గంటల పాటు పక్కన పెట్టి ఉంచేయాలి. దీనిని రాత్రి సమయంలో నానబెట్టుకొని ఉదయం ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నుంచి మూడు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. మీ జుట్టు డ్రై హెయిర్ అయితే తలస్నానం తర్వాత కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
- హెన్నా మూడు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె టేబుల్ స్పూన్, ఎగ్ వైట్ రెండు టేబుల్ స్పూన్లు, నీరు తీసుకోవాలి. ఓ గిన్నెలో హెన్నా, ఆలివ్ నూనె, ఎగ్ వైట్ వేసి తగినంత నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా కోడిగుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.