Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ ఇంట్లో కిడ్డీ బ్యాంక్ ఉందా? ఆ చిన్ని పెట్టెలోనే ఉంది మీ బిడ్డల భవిష్యత్తు. బాల్యం నుంచే వారిని పొదుపుబాట పట్టిస్తే, మీ కల నిజమవుతుంది.. అదెలాగో తెలుసుకుందాం...
- పిల్లలు సులువుగా ఓపెన్ చెయ్యలేని కిడ్డీ బ్యాంక్‌ను కొనివ్వండి.
- మీరు ఇస్తున్న పాకెట్‌మనీలో కొంత మొత్తాన్ని మిగిల్చి అందులో వేస్తే, మీరు దానికి మరికొంత మొత్తాన్ని జమ చేసి ప్రోత్సహించండి.
- పిల్లలకు ఖర్చు చేయడంలో ఉన్న ఎంజారుమెంట్ను దాచుకోవడంలో కూడా చూపించండి.
- కొన్ని బ్యాంకులు ప్రత్యేకించి పిల్లల కోసమే సేవింగ్ ఖాతాలను ఆహ్వానిస్తున్నాయి. మీ పిల్లలను తీసుకొని బ్యాంకుకు వెళ్లి, వాళ్ల పేరుతోనే ఇలాంటి అకౌంట్ ఓపెన్ చెయ్యండి.
- బ్యాంకు ఖాతాలో జమ చేయడం, సొమ్మును డ్రా చేయడం.. ఎలాగో మీరే దగ్గరుండి మీ పిల్లలకు నేర్పించండి.
- పిల్లలు దాచుకున్న సొమ్మును కొంత కాలమయ్యాక వారిపేరుతోనే పోస్టాఫీసులో డిపాజిట్ చేయండి. గడువుతీరాక వచ్చే అసలుకు వచ్చే వడ్డీని తిరిగి పిల్లలకే ఇచ్చేయండి.
- మ్యూచువల్ఫండ్స్లో బోలెడు చిల్డ్రన్ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో మీ పిల్లల పేరుతో పెట్టుబడి పెట్టండి. వాళ్ల చదువు కోసం మీరెంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది.
- డబ్బు విలువను చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియజేస్తే.. పెరిగి పెద్దయ్యాక దుబారా ఖర్చులు చేయరని పలు సర్వేలు చెబుతున్నాయి.